భారత సినీ రంగంలో భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. ముందుగా ప్రకటించిన ప్రకారం జపాన్‌లో బాహుబలి : ది ఎపిక్ స్పెషల్ ప్రీమియర్‌కు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ (Prabhas) గురువారం జపాన్‌కు వెళ్లాడు. ఈవెంట్‌కు బాహుబలి ప్రాంచైజీ నిర్మాత శోభు యార్లగడ్డ కూడా హాజరు కానున్నారు.
Read Also: Akhanda 2: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు

అభిమానులను కలుస్తానని హామీ ఇచ్చాడు!
బాహుబలి : ది ఎపిక్ జపాన్‌లో 2025 డిసెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ డిసెంబర్ 5, 6వ తేదీల్లో స్పెషల్ ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. ప్రభాస్ కల్కి 2898 ఏడీ ప్రమోషన్స్ టైంలో జపాన్‌లో తాను కలవలేకపోయిన అభిమానులను కలుస్తానని హామీ ఇచ్చాడని తెలిసిందే. వారికిచ్చిన మాట ప్రకారం రేపు జపాన్‌లో అభిమానులతో చిట్‌చాట్ చేయనున్నాడు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రభాస్- త్రిప్తి దిమ్రి పై కొన్ని కీలక సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరించారు. ప్రస్తుతం ప్రభాస్ జపాన్ ప్రయాణం కోసం షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చారు. ఆయన తిరిగి వచ్చే వెంటనే మళ్లీ సెట్ లో జాయిన్ అవుతారు..
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: