ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీకి తీసుకొని బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పైరసీ(Piracy Case) వ్యవహారంపై మరింత సమాచారం వెలికితీసేందుకు అధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. రవికి ఐదు రోజుల పోలీసు కస్టడీ అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఇచ్చిన తాజా తీర్పు మేరకు విచారణ కొనసాగుతోంది.
ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయడానికి రవిని ఒక వారం పాటు కస్టడీలోకి ఇవ్వాలని సైబర్ క్రైమ్ విభాగం కోర్టును కోరింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి చివరకు ఐదు రోజుల కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Read Also: Health: పిల్లల రక్తపోటు పెరుగుదల సంకేతాలు
ఇటీవల నగర సైబర్ క్రైమ్(Cyber Crime) అధికారులు రవిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడు గత ఆరు సంవత్సరాలుగా కరేబియన్ దీవులను కేంద్రంగా చేసుకుని 66 మిర్రర్ వెబ్‌సైట్ల ద్వారా సుమారు 21 వేల సినిమాలను పైరసీ చేసి అప్‌లోడ్ చేసినట్టు దర్యాప్తులో బయటపడింది. అంతేకాకుండా, 50 లక్షల మందికి పైగా వ్యక్తుల డేటాను సేకరించి సైబర్ నేరగాళ్లకు, గేమింగ్–బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు విక్రయించినట్టుగా పోలీసులు వెల్లడించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: