బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ-2 : తాండవం’ (Akhanda-2) చిత్రం ఈ నెల12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టులో అఖండ 2 సినిమా టికెట్ల ధర పెంపుపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ వేశారు. లంచ్ మోషన్‌కి అనుమతించిన న్యాయస్థానం..
Read Also: Akhanda 2: బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

విచారణ అనంతరం మరిన్ని వివరాలు
అఖండ 2 (Akhanda-2) ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ ధరల పెంపుపై ఈ పిటిషన్లో ప్రశ్నలు లేవనెత్తారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఎన్నో వివాదాలు వాయిదాలు, ఫైనాన్స్ క్లియరెన్సు అన్ని అడ్డంకులు దాటి రిలీజ్ కాబోతున్న అఖండ 2 కు ఇప్పడు మరో అవాంతరం ఎదురైంది. కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: