గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీ(Peddi Movie Release Date) ఖరారైంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2026 మార్చి 27న థియేటర్లలోకి రానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే పెద్ద స్థాయి అంచనాలు నెలకొన్నాయి.
Read Also: 2025 Movies: ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే


అయితే, అదే సమయంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రం మార్చి 26, 2026న విడుదల కావడం ఆసక్తికరంగా మారింది. వరుసగా ఒక రోజు తేడాతో రెండు భారీ సినిమాలు విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలుత ‘పెద్ది(Peddi)’ చిత్రాన్ని సమ్మర్‌కు వాయిదా వేయవచ్చనే ప్రచారం జరిగినప్పటికీ, ఆ వార్తలకు రామ్ చరణ్ స్వయంగా తెరదించుతూ, నిర్ణయించిన తేదీ ప్రకారమే మార్చి 27న సినిమా రిలీజ్ అవుతుందని స్పష్టంచేశారు.
ఇక ‘పెద్ది’ సినిమా గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలు, యాక్షన్‌ను మేళవించి రూపొందుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ పాత్ర పూర్తిగా కొత్త కోణంలో ఉండబోతుందని, ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: