సినీ తారలందరూ కొత్త ఆశలు, అంచనాలతో 2026కు స్వాగతం పలికారు. ఈ న్యూ ఇయర్‌కు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు శుభవార్త చెబుతూ ఒక బహుమతిని అందించారు. ఆయన హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రానున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 32వ చిత్రంగా రూపుదిద్దుకోనుంది.
Read Also: Poonam Kaur: త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఫైర్
పవర్ ఫుల్ లుక్
పవన్‌ను మునుపెన్నడూ చూడని అత్యంత స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ లుక్‌లో చూపించబోతున్నారట. స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్లను దృష్టిలో పెట్టుకుంటే, ఈ సినిమా కూడా మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
నిర్మాత రామ్ తాళ్లూరి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఈ సినిమాని ప్రకటించారు. ‘ నా డ్రీం కొత్త నిర్మాణ సంస్థ, పవన్ కళ్యాణ్ పేరు పెట్టిన సంస్థ జైత్ర రామ్ మూవీస్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ తో కలిసి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయబోతున్నాను’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు నిర్మాత రామ్ తాళ్లూరి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: