Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, అక్కడ పవర్ స్టార్ మేనియా కనిపిస్తోంది.
Read also: Gold rate today : బంగారం ధరలు స్థిరం, హైదరాబాద్‌లో ఈరోజు రేట్లు ఇవే

15 గంటల్లోనే లక్ష డాలర్ల మార్క్
నార్త్ అమెరికాలో బుకింగ్స్ మొదలైన కేవలం 15 గంటల్లోనే లక్ష డాలర్లకు పైగా ($100K+) వసూళ్లు సాధించి ఈ చిత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంకా పూర్తి స్థాయిలో షోలు ఓపెన్ కాకముందే ఈ రేంజ్ కలెక్షన్లు రావడం పవన్ కళ్యాణ్ క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
ట్రేడ్ విశ్లేషకుల అంచనా
ప్రస్తుతం నార్త్ అమెరికా వ్యాప్తంగా సుమారు 500 షోలను షెడ్యూల్ చేశారు. టాక్ గనుక పాజిటివ్‌గా వస్తే, ఈ చిత్రం ఒక్క నార్త్ అమెరికా నుండే 1.5 మిలియన్ డాలర్లను సునాయాసంగా రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు, పవన్ కళ్యాణ్ స్వాగ్ తోడవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: