हिन्दी | Epaper

Pawan Kalyan: బాల‌కృష్ణ ,అజిత్ కుమార్‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప‌వ‌న్ కళ్యాణ్

Sharanya
Pawan Kalyan: బాల‌కృష్ణ ,అజిత్ కుమార్‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప‌వ‌న్ కళ్యాణ్

దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మభూషణ్ పురస్కారాన్ని తెలుగు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరియు తమిళ సినీ స్టార్ అజిత్ కుమార్‌ ఈ పురస్కారం అందుకోవడం సినీ, రాజకీయ ప్రపంచాన్ని గర్వపడేలా చేసింది. సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రముఖ నటులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ బాలకృష్ణపై స్పందిస్తూ:

హిందూపురం ఎమ్మెల్యే, ప్రఖ్యాత సినీనటుడు నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారం అందుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఆయన పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రల్లో చూపిన అభినయ శైలి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగానికే కాదు, ప్రజాసేవా రంగానికీ తనదైన ముద్ర వేశారు. కలాసేవతో పాటు ప్రజాసేవలో మరిన్ని మైలురాళ్లు అధిగమించాలని కోరుతున్నాను అని పేర్కొన్నారు.

అజిత్ కుమార్‌పై పవన్ కళ్యాణ్ అభిప్రాయం:

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ గారు సున్నితమైన ప్రేమకథల నుంచీ, థ్రిల్లర్ మరియు యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన వైవిధ్యభరితమైన సినిమాల వరకు తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించగలిగారు.
అభినయంలోనే కాదు, స్టైల్ పరంగా కూడా ఆయనకు తానూ ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన స్టార్. అంతేకాకుండా ఒక ప్రొఫెషనల్ రేస‌ర్‌గానూ గుర్తింపు పొందారు. ఇటువంటి ప్రతిభాశాలి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

Read also: Mohanlal: ‘తుడరుమ్’ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘జన నాయగన్’ కు మరో భారీ షాక్ !!

‘జన నాయగన్’ కు మరో భారీ షాక్ !!

గ్లోబల్ స్టేజ్‌పై తెలుగు సినిమా సత్తా.. ప్రేమ్ రక్షిత్‌పై లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రశంసలు!

గ్లోబల్ స్టేజ్‌పై తెలుగు సినిమా సత్తా.. ప్రేమ్ రక్షిత్‌పై లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రశంసలు!

అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు

అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

ఫ్రాన్స్ ఎంబసీలో క్రికెటర్ అభిషేక్ శర్మ సందడి- టీమిండియాకు అభినందనలు

ఫ్రాన్స్ ఎంబసీలో క్రికెటర్ అభిషేక్ శర్మ సందడి- టీమిండియాకు అభినందనలు

కవిత ఇంటికి సీబీఐ అధికారులు, ఢిల్లీ లిక్కర్ కేసులో హైకోర్టు నోటీసులు

కవిత ఇంటికి సీబీఐ అధికారులు, ఢిల్లీ లిక్కర్ కేసులో హైకోర్టు నోటీసులు

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

భారత ఆరోగ్య రంగంలో సరికొత్త శకం

భారత ఆరోగ్య రంగంలో సరికొత్త శకం

అటవీ శాఖపై సీఎం చంద్రబాబు అసంతృప్తి, పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలని ఆదేశం

అటవీ శాఖపై సీఎం చంద్రబాబు అసంతృప్తి, పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలని ఆదేశం

No image

దేశంలో ఇంధన సంక్షోభం ముంచుకొస్తోందని – రాహుల్ గాంధీ హెచ్చరించారు.

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

📢 For Advertisement Booking: 98481 12870