సినీ రంగంలో బిజీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది ఆమె నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించడం విశేషం. తాజాగా ఆమె నటించిన రెండు సినిమాలు ఒకేసారి థియేటర్లలో, అలాగే ఓటీటీలో విడుదల కావడంతో అభిమానుల్లో చర్చనీయాంశమైంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) సరసన అనుపమ నటించిన కిష్కింధపురి చిత్రం (Kishkindhapuri movie) ఈరోజు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మంచి అంచనాలు మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మాస్ అండ్ క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, గతంలో థియేటర్లలో పెద్దగా కలెక్షన్లు సాధించలేకపోయిన పరదా మూవీ అనుకోకుండా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ (Digital platform) లోకి వచ్చేసింది.

పరదా సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం (Directed by Praveen Kandregula) లో రూపొందిన చిత్రం ‘పరదా’. ఇందులో దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.’పరదా’ సినిమా అమెజాన్ ప్రైమ్ (‘Paradha’ movie on Amazon Prime) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా సైలెంట్‌గా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. తెలుగుతో పాటుగా మలయాళంలో ఇది అందుబాటులో ఉంది. థియేట్రికల్ రిలీజ్ చేయబడిన 3 వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం. ఓవైపు థియేటర్లలో అనుపమ ‘కిష్కింధపురి’ సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తుంటే, మరోవైపు ‘పరదా’ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: