నవంబర్ 23న స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) వివాహం జరగాల్సి ఉంది. అయితే వివాహానికి కొన్ని గంటల ముందు స్మృతి మంధాన తండ్రి ఆస్పత్రి పాలయ్యారు. ఆ తర్వాతపలాశ్ ముచ్చల్ సైతం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఆ తర్వాత స్మృతి మంధాన (Smriti Mandhana) తన పెళ్లి వేడుకల ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించటంతో పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
Read Also: Smriti Mandhana: నా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది: స్మృతి
ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు
ఈ నేపథ్యంలో, సంగీత దర్శకుడు, ఫిల్మ్ మేకర్ పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) స్పందించారు. తన పర్సనల్ రిలేషన్‌షిప్ ముగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఎమోషనల్ స్టోరీ రాసుకొచ్చారు. జీవితంలో ముందుకు సాగడానికి.. వ్యక్తిగత సంబంధాల నుంచి బయటకు వస్తున్నానంటూ ఇన్‌స్టా స్టోరీ షేర్ చేశారు. నిరాధారమైన రూమర్ల గురించి ప్రజలు స్పందించిన విధానం తనకు చాలా కష్టంగా తోచిందన్న పలాశ్ ముచ్చల్.. గాసిప్ ఆధారంగా ఒకరిపై నిర్ణయానికి రావడం మానుకోవాలని ప్రజలకు సూచించారు.

మన మాటలు ఎంతలా గాయపరుస్తాయనేదీ మనం అసలు ఊహించలేమని రాసుకొచ్చారు. ప్రస్తుతం తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నానన్న ముచ్చల్.. ఈ దశను ఎదుర్కొంటానని రాసుకొచ్చారు. మరోవైపు తన గురించి ఆన్‌లైన్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పలాశ్ ముచ్చల్ హెచ్చరించారు. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: