हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Telugu News: OTT Movies: ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర

Pooja
Telugu News: OTT Movies: ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ(OG) సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో(OTT Movies) స్ట్రీమింగ్ అవుతోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పుడు తెలుగు సహా ఇతర భారతీయ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. థియేటర్‌లో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమా ఎంజాయ్ చేస్తున్నారు.

Read Also: The Girlfriend Movie: ది గర్ల్‌ఫ్రెండ్‌ ట్రైలర్ లో హైలైట్స్ ఇవే!

విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ జియో హాట్‌స్టార్‌లో
విజయ్ ఆంటోనీ కెరీర్‌లో 50వ చిత్రంగా నిలిచిన ‘భద్రకాళి’ ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్(OTT Movies) అవుతోంది. అరుణ్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్‌ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించినప్పటికీ, తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను థ్రిల్‌ పంచుతోంది.

OTT Movies

కబడ్డీ నేపథ్యంలోని ‘అర్జున్ చక్రవర్తి’ అమెజాన్ ప్రైమ్‌లో
విజయ రామరాజు హీరోగా నటించిన ‘అర్జున్ చక్రవర్తి’ సినిమా కబడ్డీ ఆట ఆధారంగా రూపొందింది. నిజ జీవిత సంఘటనలతో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు థియేటర్లలో మంచి ప్రశంసలు లభించాయి. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

OTT Movies

సిద్ధార్థ్ మల్హోత్రా–జాన్వీ కపూర్ జంటగా ‘పరమ్ సుందరి’
హిందీ రొమాంటిక్ డ్రామా ‘పరమ్ సుందరి’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన లభించింది. ఇప్పుడు ప్రైమ్ సబ్‌స్క్రైబర్లందరికీ ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.

OTT Movies

AIతో రూపొందిన ‘మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్’ జియో హాట్‌స్టార్‌లో
హస్తినాపుర సింహాసనం కోసం జరిగిన పాండవ–కౌరవ యుద్ధాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ‘మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్’ సిరీస్‌ పూర్తిగా AI టెక్నాలజీతో రూపొందించబడింది. ఈ సిరీస్ అక్టోబర్ 25 నుండి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అక్టోబర్ 26న స్టార్ ప్లస్‌లో టెలికాస్ట్ కానుంది.

OTT Movies

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870