ఓటీటీ ప్రపంచంలో హారర్, సస్పెన్స్ సినిమాల పట్ల ప్రేక్షకుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. పొలిమేర 2, తంత్ర, పిండం వంటి చిత్రాలు ఆడియెన్స్‌ను మంచి టెన్షన్‌తో భయపెట్టాయి. ఇప్పుడు ఈ కోవలో మరో హారర్ థ్రిల్లర్ “7/G” వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సోనియా అగర్వాల్, స్మృతి వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తమిళంలో పెద్ద హిట్‌గా నిలిచింది. హరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ విపిన్ కీలక పాత్ర పోషించడమే కాకుండా సంగీతాన్ని అందించారు.తమిళంలో హిట్, ఇప్పుడు తెలుగు వెర్షన్ ఈ సంవత్సరం జులైలో థియేటర్లలో విడుదలైన 7/G సినిమా ప్రేక్షకులను భయపెట్టి మంచి రెస్పాన్స్ అందుకుంది. వసూళ్లు కూడా ఓ మోస్తరుగా వచ్చాయి. ఆ తర్వాత ఆగస్టులో ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుని ఆగస్టు 9న తమిళ వెర్షన్‌ను స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది.
ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది.బుధవారం అర్థరాత్రి నుంచి “7/G” సినిమా ఆహాలో తెలుగు ప్రేక్షకుల కోసం స్ట్రీమింగ్ అవుతోంది.సెకండ్ ఇన్నింగ్స్‌లో మెరిసిన సోనియా గతంలో 7G బృందావన్ కాలనీ చిత్రంతో తెలుగులో అభిమానులను సంపాదించుకున్న సోనియా, ఈ చిత్రంతో మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. అదిరే కథ, అదుర్స్ స్క్రీన్‌ప్లే ఈ సినిమా కథ రాజీవ్, వర్ష అనే దంపతులు, వారి కొడుకు రాహుల్ చుట్టూ తిరుగుతుంది. కొత్త ఫ్లాట్‌లోకి మారిన తర్వాత వర్ష అనుభవించే పారానార్మల్ యాక్టివిటీస్ ఆ కుటుంబాన్ని ఎలా భయపెట్టాయి? వర్ష తన ఇంటిని, కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆత్మీయ శక్తులతో ఎలా పోరాడింది? ఈ కథను దర్శకుడు హరూన్ ఎంతో థ్రిల్లింగ్‌గా స్క్రీన్‌ప్లేలో చూపించారు.