జాన్వీకపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘హోమ్ బౌండ్’ ఇప్పటికే విడుదలకు ముందే ప్రేక్షకుల, సినీ విమర్శకుల దృష్టిని ఆకర్షించింది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, కథా నిర్మాణం, నటనా ప్రతిభ, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. సినిమా సృజనాత్మకత, సానుకూల సందేశం, సమకాలీన సమస్యలపై ప్రతిబింబం చూపడం వల్ల ఇది పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ (International film festivals) లో ప్రదర్శనకు ఎంపిక అయింది.
పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో స్క్రీనింగ్ చేయబడింది. అయితే ఈ సినిమా ‘ఆస్కార్ 2026’ (Oscars 2026) నామినేషన్స్ కోసం అఫిషియల్ ఎంట్రీ పొందింది.98వ అకాడమీ అవార్డ్స్ – 2026 కోసం భారత్ తరఫున ‘హోమ్ బౌండ్’ మూవీ అధికారిక ఎంట్రీ సాధించింది. ‘ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్’ విభాగంలో ఈ సినిమా పోటీ పడనుంది. ఈ విషయాన్ని సెలక్షన్ కమిటీ ఛైర్‌పర్సన్ ఎన్. చంద్ర వెల్లడించారు.
ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్
భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ఈ ఏడాది ఆస్కార్ ఎంట్రీకి మొత్తం 24 సినిమాలు పోటీ పడ్డాయని, అవన్నీ మనసులను తాకే సినిమాలేనని తెలిపారు. వాటిల్లో ‘హోమ్ బౌండ్’ చిత్రాన్ని (‘Home Bound’ Film) ఎంపిక చేసినట్లు చెప్పారు.‘హోమ్‌బౌండ్’ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. భారత్ తరఫున 2026 ఆస్కార్స్ కోసం అఫిషియల్ ఎంట్రీ పొందడంపై మేకర్స్ స్పందించారు.
”98వ అకాడమీ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ (Best International Feature) కోసం హోమ్‌బౌండ్ భారతదేశం తరపున అధికారిక ఎంట్రీ పొందిందని ప్రకటించడానికి మేము గర్విస్తున్నాము” అని పేర్కొన్నారు.పోలీసులు అవ్వాలనే లక్ష్యం పెట్టుకున్న ఇద్దరు స్నేహితులు.. తమ కలను సాధించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో కుల, మత వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే ‘హోమ్‌బౌండ్’ చిత్ర కథాంశం.
ఇటీవల టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో
మే నెలలో జరిగిన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్ స్క్రీనింగ్ చేయబడింది. సినిమా చూసిన వారంతా స్టాడింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇటీవల టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో రెండో రన్నరప్ గా నిలిచింది. ఇంటర్నేషనల్ పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది. సెప్టెంబర్ 26న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: