
టాలీవుడ్‌లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న యువ సంచలనం తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) తన అద్భుతమైన నటనతో కూడా తెరపై అలరిస్తున్నారు. ‘ఓం శాంతి శాంతి శాంతిః (‘Om Shanti Shanti Shanti’) అనే కొత్త ప్రాజెక్ట్‌లో మరోసారి లీడ్‌లో చేస్తున్నారు. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం, సహజమైన హాస్యం,
Read Also: Pratyusha: దివంగత నటి ప్రత్యూష బయోపిక్ లో నేషనల్ క్రష్?
టీజర్ విడుదల
ఆకట్టుకునే డ్రామాతో కూడిన వినోదభరితమైన విలేజ్ కామెడీ. సృజన్ యారబోలు, ఆదిత్య పిట్టే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. కామెడీ కథాంశంతో ఈ సినిమా రాబోతుండగా ప్రస్తుతం టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
గ్రామీణ నేపథ్యంలో సాగే పాత్రలో తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) తన నటనతో కట్టిపడేశారు. ఐపిఎల్ సంభాషణ తన పాత్రని హైలైట్ చేసే హ్యూమరస్ బిట్‌గా నిలుస్తుంది. ఈషా రెబ్బా తన పాత్రలో ఆకట్టుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: