తెలుగు చిత్రసీమలో సుహాస్ పేరు వినగానే, ఆడియన్స్‌లో ఒక రకమైన విశ్వాసం కలుగుతుంది. స్టార్ కూడా కాదు, కమర్షియల్ హీరో కూడా కాదు, కానీ ప్రతి సినిమా ద్వారా, ఏదో ఓ కొత్త భావనను, నిజాయితీని అందించాలన్న ప్రయత్నం చేస్తాడు. అలాంటి సుహాస్ తాజా సినిమా ‘ఓ భామా అయ్యో రామా’ నేడు (జూలై 10) విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ
క్లాసికల్ డాన్సర్ అయిన మీనాక్షి (అనిత)ని తనకి పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి చేసుకుంటాడు డైరెక్టర్ విజయ్ (రవీంద్ర విజయ్). మీనాక్షి నెల తప్పడం విజయ్‌కి ఇష్టం ఉండదు. అతని ఇష్టం లేకుండా రామ్ (సుహాస్)కి జన్మనిస్తుంది మీనాక్షి. అయితే సమాజం దృష్టిలో రామ్‌కి తండ్రిని నేనే అని తెలిస్తే తన కెరియర్‌కి ఇబ్బంది అవుతుందని రామ్‌నిచంపేయాలని అనుకుంటాడు విజయ్. అతని దుర్మార్గాన్ని కళ్లారా చూసిన మీనాక్షి, భర్తని వదిలేసి కొడుకుని పెద్ద డైరెక్టర్ (Director) ని చేయాలని తపిస్తుంది. అయితే తండ్రి కారణంగా సినిమాలపై అసహ్యం పెంచుకుంటాడు రామ్.తల్లి ఎంత ప్రోత్సహించినా కూడా ఆ ఫీల్డ్ అంటే ఇష్టపడడు.
మ్యాజిక్
కొన్నాళ్లకు మీనాక్షికన్నుమూయగా ఒంటరి వాడైన రామ్‌కి అన్నీ తానై నిలుస్తాడు మామ బాల (అలీ). రామ్‌ని పెంచి పెద్ద చేస్తాడు. అయితే యూఎస్ వెళ్లి ఎంఎస్ చేయాలనుకున్న రామ్‌కి అనూహ్య పరిస్థితుల్లో ఎదురుపడ్డ సత్యభామ (మాళవిక మనోజ్), అతన్ని దర్శకుడు హరీష్ శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ చేస్తుంది. రామ్ తల్లి కన్న కలల్ని నిజం చేయడానికి ఆమె పడ్డ తపన ఏంటి? రామ్ చివరికి ఏమయ్యాడు? అన్నదే ‘ఓ భామా అయ్యో రామ’ (Oh Bhama Ayyo Rama) మిగిలిన కథ.సుహాస్ సినిమా సెలక్షన్ అప్పుడప్పుడూ మిస్ ఫైర్ అయినా మ్యాజిక్ చేస్తాడనే నమ్మకం అయితే ఆడియన్స్‌లో బలంగా ఉంది. ఒక్కోసారి కథలో లోపల వల్ల అతని సినిమాలు ఆడలేదమో కానీ, అతని పెర్ఫామెన్స్‌కి వంకలు పెట్టే పరిస్థితి ఉండదు.

డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో
ఈ సినిమాలో కూడా సుహాస్, రామ్ పాత్రలో ఒదిగిపోయాడు. తన చిన్నతనంలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల భయంతో బతుకుతూ, తిరిగి భయాన్ని వీడి తాను వద్దనుకున్న ఫీల్డ్‌లోనే రాణించే పాత్రలో చాలా వేరియేషన్స్ చూపించాడు. మదర్ సెంటిమెంట్ సీన్లలో కానీ, క్లైమాక్స్ సీన్‌లో కానీ రామ్ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. గల్లీ గల్లీ సాంగ్‌లో డాన్స్ ఇరగదీశాడు సుహాస్. ఆ పాట పాడి సింగర్‌గానూ మల్టీ టాలెంట్ చూపించి మంచి మార్కులేయించుకున్నాడు.ఇక హీరోయిన్ మాళవిక మనోజ్ కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించింది. తమిళ్‌లో ‘జో’ అనే చిత్రంతో క్రేజ్ దక్కించుకున్న మాళవిక మనోజ్ (Malavika Manoj), ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రంలో భామగా మెరిసింది. తెలుగులో తొలిచిత్రమే అయినా, యాక్టింగ్‌లో మంచి అనుభవమే ఉండటంతో సత్యభామ పాత్రలో ఒదిగిపోయింది.
పెద్ద ప్రశ్న
సుహాస్ యాక్టింగ్ ఇరగదీస్తాడు కాబట్టి అతనికి జోడీగా అంటే పెర్ఫామెన్స్‌లో తేలిపోతుంటారు. కానీ ఈ కొత్త హీరోయిన్ గట్టి పోటీ ఇచ్చింది.కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు, ఈ కథకి సుహాస్ అయితే బాగుంటారని కథ రాసుకున్నప్పుడే అనుకున్నానని దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే, అసలు దర్శకుడు కథ ఏం చెప్పారు? సుహాస్ ఎలా ఒప్పుకున్నారు అన్నదే. ఆయన చెప్పిన కథని తీయలేదా? లేదంటే అసలు కథ చెప్పకుండానే ఒప్పించారా? ఎందుకంటే, సుహాస్‌ని అనుకుని రాసుకున్న కథలో క్లారిటీ మిస్ అయితే ఓకే కానీ అసలు కథ లేదన్నదే ఈ సినిమాకి పెద్ద మైనస్. ‘ఈ ప్రపంచంలో భయాన్ని ఓడించగలిగేది ప్రేమ ఒక్కటే’ అనే లైన్ మంచిదే కానీ ఆ లైన్ చుట్టూ దర్శకుడు రామ్ గోధల అల్లిన కథ తేడా కొట్టింది.
సుహాస్ పారితోషికం ఎంత?
తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుహాస్ స్వయంగా వెల్లడించిన ప్రకారం, ఇప్పుడు ఆయన ఒక్క సినిమా కోసం రూ. 3 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు. ఇది ఆయన కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.
సుహాస్ జీవిత విశేషాలు?
సుహాస్ 1990 ఆగస్టు 19న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించారు.సుహాస్ “HIT: The 2nd Case” (2022), “మజిలీ” (2019), “డియర్ కామ్రేడ్” (2019) వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Shruti Haasan: పెళ్లి అంటే నాకు చాలా భయం