యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రానున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ (Tovino Thomas) కీలక పాత్ర పోషిస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Read Also: Nuvvu Naaku Nachav Movie: ‘నువ్వు నాకు నచ్చావ్’ రీ-రిలీజ్ ఎప్పుడంటే?

‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరో సినిమా చేస్తుండటం అందులో టోవినో థామస్ నటిస్తున్నారనే వార్తలు రావడంతో ఈ ప్రాజెక్ట్ స్థాయి పాన్-ఇండియాలో మరింత పెరిగింది.
అయితే తాజాగా గోవాలో జరిగిన ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేదికపై టోవినో థామస్‌కు ఈ విషయంపై మీడియా నుండి ప్రశ్న ఎదురైంది. #NTRNeel ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారా అని అడగ్గా, టోవినో థామస్ తెలివిగా స్పందిస్తూ, “ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడే స్థితిలో లేను” అని బదులిచ్చారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: