సినీనటి రష్మిక మందన్న (Rashmika Mandanna) ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఈసారి, ఆమెపై కొంతకాలంగా వస్తున్న పుకార్లపై స్పందిస్తూ, వ్యక్తిగత స్థాయిలో తన భావాలను పంచుకున్నారు. ముఖ్యంగా, కన్నడ చిత్ర పరిశ్రమ (Kannada film industry) లో ఆమెపై నిషేధాలు విధించబడ్డట్లు వచ్చిన వార్తలపై ఆమె (Rashmika Mandanna) స్పష్టత ఇచ్చారు.తన రాబోయే చిత్రం ‘థామా’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై ఆమె మాట్లాడారు.
Mass Jathara Movie: మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ విడుదల
“నన్ను ఏ ఇండస్ట్రీ నిషేధించలేదు. కొన్నిసార్లు అపార్థాల వల్ల ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తుంటాయి” అని ఆమె అన్నారు. ఇతరుల కోసం మనం జీవించకూడదని, మన పని మనం చేసుకుంటూ పోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.గతంలో సూపర్‌హిట్ అయిన ‘కాంతార’ సినిమాపై ఆమె స్పందించలేదంటూ వచ్చిన విమర్శలపైనా రష్మిక (Rashmika Mandanna) వివరణ ఇచ్చారు. “ఏ సినిమా అయినా విడుదలైన వెంటనే నేను చూడలేను.

ప్రజలు ఏమనుకున్నా పెద్దగా పట్టించుకోను
‘కాంతార’ (‘Kantara’ movie) కూడా కొన్ని రోజులు ఆగి చూశాను. సినిమా చూశాక చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ మెసేజ్ చేశాను. వాళ్లు కూడా నాకు ధన్యవాదాలు తెలిపారు” అని ఆమె చెప్పారు.”తెర వెనుక జరిగే విషయాలు అందరికీ తెలియవు కదా. మన వ్యక్తిగత జీవితంలోని ప్రతీ విషయాన్ని కెమెరా ముందుకు తీసుకురాలేం.
నేను కూడా అన్ని విషయాలను ఆన్‌లైన్‌లో పంచుకునే వ్యక్తిని కాదు. అందుకే ప్రజలు ఏమనుకున్నా పెద్దగా పట్టించుకోను. నా నటన గురించి వాళ్లు ఏం మాట్లాడుతారనేదే నాకు ముఖ్యం. దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాను” అని రష్మిక స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: