News Telugu: ఇటీవల విడుదలైన పరదా సినిమాకు ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనపై చిత్రబృందం హైదరాబాద్‌లో సోమవారం ఒక థాంక్స్ మీట్ (Thanks Meet) నిర్వహించింది. ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన అనుభూతులను పంచుకుంటూ కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు.

కమర్షియల్ సినిమాలు vs ప్రయోగాత్మక సినిమాలు
అనుపమ మాట్లాడుతూ – “కమర్షియల్ సినిమాల్లో ఎన్ని తప్పులున్నా ప్రేక్షకులు పట్టించుకోరు. కానీ లేడీ ఓరియెంటెడ్ లేదా ప్రయోగాత్మక సినిమాల విషయానికి వచ్చేసరికి మాత్రం చిన్న చిన్న తప్పుల్నీ పెద్దవిగా చూపిస్తారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పరదా’ చిత్రాన్ని (Parada film) తన మనసుకు దగ్గరైన కథగా భావించి నటించానని అనుపమ తెలిపారు. కానీ కొందరు దీనిని ప్రయోగాత్మక చిత్రం అంటూ, లోపాలపై మాత్రమే దృష్టి పెడుతున్నారని అన్నారు. “కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే సగం మంది విమర్శిస్తారు. కానీ మేము పడిన కష్టాన్ని గుర్తిస్తే ఇలాంటి కొత్త కథలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది” అని ఆమె కోరారు.
దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల భావోద్వేగం
ఈ కార్యక్రమంలో దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు ప్రేక్షకులు మంచి కథలను ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ సినిమా తీయడం జరిగిందని చెప్పారు. “కానీ కొందరు మంచి కంటెంట్‌ను విస్మరించి, తప్పులు వెతకడంపైనే దృష్టి సారిస్తున్నారు. సినిమా విడుదలై కొద్దిరోజులే అయ్యాయి, ఇప్పుడే విమర్శించడం సరికాదు” అని అభిప్రాయపడ్డారు.
అనుపమ ధైర్యానికి ప్రశంస
ప్రవీణ్ మాట్లాడుతూ – “ఇలాంటి కాన్సెప్ట్ తెలుగులో ఇప్పటివరకు రాలేదు. ముఖం కనిపించని పాత్రలో నటించేందుకు ఒప్పుకున్న అనుపమ గొప్ప ధైర్యం చూపించారు. ఈ సినిమా ద్వారా ఆమె జాతీయ అవార్డు అందుకోవాలి” అని ఆకాంక్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: