ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కొత్తగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో టాలీవుడ్ సూపర్ స్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్నారు.నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే కేరళ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Aaryan Movie: ఆర్యన్ టీజర్ చూసారా?
కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దసరా పండుగ (Dussehra festival) కానుకగా.. మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ను పంచుకుంది.
ఈ సినిమా నుంచి నయనతార పాత్రను పరిచయం మేకర్స్. ఈ సినిమాలో నయన్ శశిరేఖ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ సినిమా నుంచి అప్‌డేట్స్
ఈ పోస్టర్‌లో నయన్ పసుపు రంగు చీరలో మెరిసిపోతుంది. ఇక కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: