हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Latest News: Nayanthara: ఆటుపోట్లు మధ్య 22 ఏళ్లు పూర్తి చేసుకున్న నయనతార

Anusha
Latest News: Nayanthara: ఆటుపోట్లు మధ్య 22 ఏళ్లు పూర్తి చేసుకున్న నయనతార

సినీ రంగంలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలకుపైగా తన సత్తా చాటుకుంటూ, దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara). ఆమె నటనా ప్రస్థానం నేటితో, 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

Dude Movie: డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ చూసారా?

ఈ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ నయనతార (Nayanthara) తన సోషల్ మీడియా ఖాతాలో ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో ఆమె తన సినీ జీవితంలో ఎదురైన కష్టాలు, సాధించిన విజయాలు, అభిమానుల ప్రేమ గురించి హృదయపూర్వకంగా ప్రస్తావించింది.

సినిమాలే నా ప్రపంచం అవుతాయని ఎప్పుడూ ఊహించలేదు. తెలియకుండానే ఇండస్ట్రీలోకి (film industry) వచ్చాను. కానీ ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, ప్రతి నిశ్శబ్దం నన్ను మార్చేశాయి. ధైర్యాన్ని ఇచ్చాయి. నన్ను నేను గా మార్చాయి. ఈ ప్రయాణంలో నాతో ఉన్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అంటూ న‌య‌న్ చాలా ఎమోష‌న‌ల్‌గా రాసుకొచ్చింది.

తెలుగులో ‘చంద్రముఖి’ సినిమాతో పరిచయమైన నయనతార, అతి తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

Nayanthara
Nayanthara

తన మార్కెట్‌ను పాన్ ఇండియా స్థాయికి

గతేడాది షారుక్ ఖాన్ సరసన ‘జవాన్’ సినిమా (‘Jawaan’ movie) తో బాలీవుడ్‌లోనూ భారీ విజయాన్ని అందుకుని తన మార్కెట్‌ను పాన్ ఇండియా స్థాయికి విస్తరించుకున్నారు.ఈ పోస్టు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. అభిమానులే కాకుండా, సినీ సెలబ్రిటీలు కూడా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.ప్రస్తుతం నయనతార మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సరసన ఒక సినిమాలో నటిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌ను 2026 సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘మీసాల పిల్లా’ పాట సోషల్ మీడియాలో, రీల్స్‌లో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870