దివంగత నటి ప్రత్యూష (Pratyusha) తెలంగాణలోని భువనగిరిలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగింది. ప్రత్యూష చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. తల్లి సరోజినీదేవి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. చదువు సమయంలోనే మోడలింగ్‌లో అడుగుపెట్టిన ఆమె ఉత్తమ స్మైల్ విభాగంలో అవార్డు కూడా గెలుచుకుంది. 17 ఏళ్ల వయసులో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి 1998 నుంచి 2002 వరకు తెలుగు, తమిళ భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: Akhanda-2: ఈ నెల 12న ‘అఖండ-2’ విడుదల?
తెలుగులో ‘రాయుడు’, ‘శ్రీరాములయ్య’, ‘సముద్రం’, ‘కలుసుకోవాలని’ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. టీవీ సీరియల్స్‌లో కూడా నటించింది. 2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష అకాల మరణం సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచింది. ఆమె మరణం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టిన ప్రత్యూష (Pratyusha) జీవితం ఇప్పటికీ చాలామందిని కలిచివేస్తుంది.

దివంగత నటి ప్రత్యూష జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీయాలనే ఆలోచన ఇప్పుడు తెరపైకి వచ్చింది. అయితే, ఈ సినిమాలో, రష్మిక (Rashmika Mandanna) ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, టాక్. కథను ఇప్పటికే రష్మిక విన్నారని, ఈ ప్రాజెక్ట్‌కు ఆమె దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది రష్మిక లాంటి టాప్ హీరోయిన్ ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర చేస్తే అది కెరీర్‌కు ప్లస్ అవుతుందని అంటుండగా, మరికొందరు మాత్రం కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఇలాంటి సున్నితమైన బయోపిక్ చేయడం రిస్క్ కాదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలపై స్పష్టత రానుందా అనేది వేచి చూడాల్సిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: