हिन्दी | Epaper
ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

మస్తాన్ సాయి కేసులో నార్కోటిక్ పోలీసులు

Sharanya
మస్తాన్ సాయి కేసులో నార్కోటిక్ పోలీసులు

రాజ్ తరుణ్, లావణ్య కేసుతోపాటు యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న మస్తాన్ సాయి అరెస్టు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో యాంటీ నార్కోటిక్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. మస్తాన్‌సాయి డ్రగ్స్ దందా గురించి యాంటీ నార్కోటిక్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. టాస్క్‌ఫోర్స్‌తో కలిసి సైబరాబాద్ నార్కోటిక్ బ్యూరో పనిచేస్తోంది.

mastansai

లావణ్య ఫిర్యాదుతో పోలీసులు మస్తాన్‌సాయిని అరెస్ట్ చేశారు. నార్సింగి పోలీసులు అతడిని ఏడు రోజుల కస్టడీకి కోరారు. ఈ విచారణలో తెలంగాణ న్యాబ్ పోలీసులు పాల్గొననున్నారు. మరోవైపు, మస్తాన్‌సాయి నిర్వహించిన డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్న వారికి అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు.మస్తాన్ సాయి డ్రగ్ పార్టీ వీడియోలో ఉన్న వారందరూ పరారయ్యారు. మస్తాన్ సాయి కేసులో నార్కోటిక్ పోలీసులు నిఘా పెంచారు. యువతులను ట్రాప్ చేసి వారి నగ్న వీడియోలు చిత్రీకరించిన తర్వాత వాళ్లను బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడంటూ లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన పార్టీలకు సంబంధించిన వీడియోలో బయటకు వచ్చాయి. అందులో చాలా మంది యువతీయువకులు పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నార్కోటిక్ పోలీసులు డ్రగ్స్ వ్యహారంపై రంగంలోకి దిగారు. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు మస్తాన్ సాయిని కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు మధ్యాహ్నం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870