విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పటి తరానికి హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ గుర్తుకు వస్తాయి. కానీ ఆ స్థాయి టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లోనే భారతీయ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసిన దర్శకులు కూడా ఉన్నారు. ఆ జాబితాలో ముందుగా గుర్తుకు వచ్చే పేరు దర్శకుడు ఎస్. శంకర్. ‘భారతీయుడు’, ‘జీన్స్’ వంటి చిత్రాల్లో అప్పటి టెక్నాలజీని పూర్తిగా వినియోగించారు.
Read Also: Thalapathy Vijay: సినిమాల కు రిటైర్‌మెంట్ ప్రకటించిన విజయ్
2026లో రీరిలీజ్
ఆ తర్వాత, ఎస్.ఎస్. రాజమౌళి ‘ఈగ’ చిత్రంతో భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. ఒక కీటకాన్ని హీరోగా నిలబెట్టి, దాని కథను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కించారు. ఇప్పుడు, ‘ఈగ’ చిత్రాన్ని (Nani) 2026లో భారతదేశంతో పాటు విదేశాలలోనూ రీరిలీజ్ చేయడానికి రాజమౌళి టీమ్ సన్నాహాలు చేస్తోందట.

ఈగ (2012) చిత్రం నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన ఈ చిత్రంలో ఈగ కథను ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) ఎలివేట్ చేసిన విధానం ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్ ని మెప్పించింది.ఈగ పాత్ర క్రియేషన్ కోసం హాలీవుడ్ సినిమాని కాపీ కొట్టారంటూ కొన్ని విమర్శలు ఉన్నా కానీ, ఈగ పాత్రను భారతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని మలిచిన విధానం, విజువల్ ఎఫెక్ట్స్ స్టాండార్డ్స్ ని అందిపుచ్చుకున్న విధానం ప్రతిదీ నిపుణుల దృష్టిని ఆకర్షించాయి.
ఒక ఈగ జీవనవిధానం, పగ ప్రతీకారం అంటూ తిరిగే సన్నివేశాలను, పాత్రను అతిశయోక్తి లేకుండా డిజైన్ చేసిన తీరు ఆశ్చర్యపరిచింది. రాజమౌళి ఏం చేసినా అది పూర్తి స్పష్ఠతతో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని గుర్తింపు వచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలతోనే కాదు, ప్రయోగాత్మక కథలతోను నిరూపించగల నిష్ణాతుడిగా జక్కన్న గుర్తింపు పొందాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: