న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ది ప్యారడైజ్ (‘The Paradise’ movie). దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని జోడిగా కయాదు లోహర్ (Kayadu Lohar) కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే విడుదలైన పోసర్స్ మూవీపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Read Also: Gv Prakash: ఆన్‌లైన్ మోసానికి గురైన సంగీత దర్శకుడు

స్పెషల్ సాంగ్
గత రెండు మూడు రోజులుగా ఈ మూవీ హీరోయిన్ ఎవరనే విషయం పై చర్చ జరగ్గా.. ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. గతంలో తమన్నాను అనుకున్న స్పెషల్ సాంగ్ ఆఫర్ ఇప్పుడు పూజా హెగ్డేకు దక్కినట్లు తెలుస్తోంది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూజా, నాని (Nani) తో కలిసి ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇది పూజా కెరీర్‌కు బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: