हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Nani: కోర్ట్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో నాని డాన్స్ వీడియో వైరల్!

Digital
Nani: కోర్ట్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో నాని డాన్స్ వీడియో వైరల్!

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మరో విజయం

సినిమా ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నాని హీరోగానే కాదు, నిర్మాతగాను తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన నిర్మించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతోంది. రీసెంట్‌గా విడుదలైన కోర్ట్ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శిస్తుంది.

హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించగా, విజయ్ బుల్గానియన్ సంగీతం అందించారు. నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేనేని ఈ సినిమాను నిర్మించగా, నాని సమర్పకుడిగా వ్యవహరించారు.

పోక్సో యాక్ట్ పై కీలక సందేశం

కోర్ట్ సినిమా పోక్సో యాక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రం. భారతదేశంలో 18 ఏళ్లు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి ఈ చట్టం తీసుకువచ్చారు. అయితే, కొందరు దీన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు? అనేదాన్ని ఈ చిత్రంలో చక్కగా చూపించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

కలెక్షన్ల పరంగా కోర్ట్ హవా

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. సినిమా విడుదలైన మొదటి వారంలోనే కలెక్షన్లు క్ర‌మంగా పెరుగుతూ, నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతోంది. టాలీవుడ్ ట్రేడ్ అనలిస్టుల ప్రకారం, ఈ సినిమా సుమారు ₹10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా, ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ. 10 కోట్ల మేర జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ. 11 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది, అంటే సుమారు రూ. 22 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించాలి. కానీ సినిమా లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం, ఈ లెక్కలన్నీ సులువుగా అందుకోవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సక్సెస్ మీట్ – నాని డ్యాన్స్ వైరల్

సినిమా విజయం సాధించిన సందర్భంగా నాని ఒక సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో యువ నటీనటులు ఈ సినిమా చార్ట్ బస్టర్ ప్రేమలో పాటకు స్టెప్పులు వేసి, నానిని కూడా స్టేజి మీదకు తీసుకెళ్లారు. ఇద్దరు పిల్లలు, ప్రియదర్శితో కలిసి నాని కూడా స్టెప్పులు వేసి ప్రేక్షకులను అలరించారు. హిట్ సినిమా విజయోత్సాహంతో నాని చేసిన డ్యాన్స్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Court Movie Success Meet Gallery (1).jpg

నాని బ్యానర్‌లో మరో హిట్

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ నుంచి వచ్చిన హిట్, మీటర్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత కోర్ట్ సినిమా కూడా అదే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందింది. ప్రియదర్శి ఆకట్టుకునే నటన, హృదయాన్ని హత్తుకునే కథనం, అద్భుతమైన స్క్రీనింగ్ తో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తోంది. నాని నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870