నటసింహం Nandamuri Balakrishna 65వ పుట్టినరోజు వేడుకలు: సంచలన వ్యాఖ్యలు!
నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే Nandamuri Balakrishna ఈ రోజు తన 65వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా వంటి విదేశాల్లో కూడా ‘బాలయ్య బాబు’ పుట్టినరోజు వేడుకల సందడి మొదలైంది. అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ నటీనటులు, దర్శకులు, అభిమానులు, రాజకీయ నాయకులు భారీ స్థాయిలో జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో స్పందిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నుంచి వారసత్వంగా నటనను మాత్రమే కాదు, సేవా గుణాన్ని కూడా అందుకున్నారని బాలకృష్ణ నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా తన తల్లి కోరిక మేరకు స్థాపించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేదవారికి ఉచితంగా వైద్యం అందజేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. ఈ రోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌ని సందర్శించి, తన 65వ జన్మదిన వేడుకలను క్యాన్సర్ బాధితుల మధ్య జరుపుకోవడం ఆయన సేవా దృక్పథానికి నిదర్శనం.

బసవతారకం ఆసుపత్రిలో బాలయ్య పుట్టినరోజు వేడుకలు: అభిమానుల సందడి
బాలకృష్ణ జన్మదినం సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఆవరణంలో ఉన్న తల్లిదండ్రులు నందమూరి తారక రామారావు, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బాలకృష్ణ. క్యాన్సర్ చిన్నారుల మధ్య కేక్ కట్ చేసిన బాలకృష్ణ.. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పుట్టిన రోజు సందర్భంగా బాలకృష్ణకి విశేష చెప్పేందుకు బసవతారకం ఆసుపత్రికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పలు సంచలన విషయాలను తెలిపారు. ముఖ్యంగా తన తల్లిదండ్రుల కోరికను ఈ రోజున గుర్తు చేసుకున్నారు.
“నాకు పొగరు ఉంది”: సంచలన వ్యాఖ్యలు, పద్మభూషణ్ అవార్డుపై స్పందన
“అందరూ తనకు పొగరు ఉందని అనుకుంటారు. అవును అందరూ అనుకునేది నిజమే, నాకు పొగరు ఉంది. అది కూడా నన్ను చూసుకుంటే నాకు పొగరు” అని బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎందుకంటే నేను ముందు నన్ను ప్రేమించుకుంటా. తర్వాతనే అందరూ” అని ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యలు బాలకృష్ణలోని సూటిదనాన్ని, బోల్డ్‌నెస్‌ను మరోసారి బయటపెట్టాయి. ఆయన అభిమానులు ఈ వ్యాఖ్యలను స్వాగతించగా, కొందరు ఆశ్చర్యపోయారు. తనకు బిరుదులు అలంకారం కావని, ఆ బిరుదులకే తాను అలంకారం అని బాలకృష్ణ అన్నారు. తనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డు గురించి మాట్లాడుతూ, ఈ అవార్డు తాను చేసిన సేవలకు దక్కిందని ఆయన అన్నారు. తాను చేసే సేవలకు గుర్తింపు లభించడం తనకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా, బాలకృష్ణ హిందూ ధర్మం గురించి కూడా మాట్లాడారు. “ఎవరికైనా సరే మన శరీరం మన అదుపు ఆజ్ఞలో ఉండాలి. ఆ గుణం హిందూ ధర్మంలో ఉంది” అని బాలకృష్ణ అన్నారు. “అంతేకాదు, హిందూయిజంలో మరొక గొప్పతనం అందరూ బాగుండాలని కోరుకోవడం” అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు బాలకృష్ణలోని ఆధ్యాత్మిక చింతనను, సనాతన ధర్మంపై ఆయనకున్న విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తనకు ఉండాలని ఆయన కోరారు.
Read also: Nandamuri Balakrishna: బాలకృష్ణ కు పుట్టినరోజు విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్