ఇప్పటివరకు సాఫ్ట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక మందన్న(Rashmika Mandanna), ఈసారి పూర్తిగా భిన్నమైన రూపంలో కనిపించనుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘మైసా’ (Mysaa Movie) నుంచి విడుదలైన యాక్షన్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ చిత్రంతో నూతన దర్శకుడు రవీంద్ర పుల్లె(Ravindra Pulle) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో రష్మిక తొలిసారి ఒక ఉగ్ర స్వభావం గల తిరుగుబాటు యువతిగా నటించడం విశేషం.
Read Also: Champion Movie: చాంపియన్ ట్రెండ్.. ప్రభాస్ పేరు వైరల్
గ్లింప్స్‌లో రష్మిక లుక్, కదలికలు, కళ్లలో కనిపించే తీవ్రత ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. శరీరమంతా గాయాలు, తెగిపోయిన బేడీలు, చేతిలో ఆయుధంతో కనిపించే ఆమె పాత్ర గిరిజన ఉద్యమ నేపథ్యాన్ని బలంగా ప్రతిబింబిస్తోంది. ఇప్పటివరకు రొమాంటిక్, కమర్షియల్ పాత్రలకే పరిమితమైన రష్మిక, ఈ సినిమాలో పూర్తి స్థాయిలో యాక్షన్ జోనర్‌లోకి అడుగుపెట్టింది.

‘మైసా’ అనే పదానికి ‘అమ్మ’ అనే అర్థం ఉంది. గోండు గిరిజన తెగల నేపథ్యంలో సాగే ఈ కథ, అణచివేతకు ఎదురొడ్డి నిలిచే ఓ సహజ నాయకురాలి జీవన పోరాటాన్ని చూపించనుందని తెలుస్తోంది. భావోద్వేగాలు, ఆవేశం, ప్రతిఘటన వంటి అంశాలతో ఈ చిత్రాన్ని ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశానికి మరింత శక్తినిస్తోంది.
అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘పుష్ప 2’లో ప్రతినాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తారక్ పొన్నప్ప ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘మైసా’, రష్మిక కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడిన చిత్రంగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: