సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మురారి’ సినిమా (Murari Movie), 2001లో విడుదలై ఘన విజయం సాధించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ మూవీ ‘మురారి’ (Murari Movie) మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. విడుదలై ఎన్నేళ్లు గడిచినా ఈ సినిమాకు ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేకమైన ఆదరణ ఉంది. భావోద్వేగాలు, సంగీతం, కథనంతో ‘మురారి’ మహేష్ కెరీర్‌లో ఓ మైలురాయి చిత్రంగా నిలిచింది.
Read Also: Nani: ఈగ మూవీ రీరిలీజ్ ఎప్పుడంటే?

టికెట్ ధరలు
ఇప్పుడు ఈ సినిమాను 4K ఫార్మాట్‌లో రీ రిలీజ్ చేయడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. దిల్ రాజుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ రీ రిలీజ్‌ను చేపట్టడం విశేషంగా మారింది.
సింగిల్ స్క్రీన్స్ లో రూ. 99, మల్టిప్లెక్స్ లో రూ. 105గా టికెట్ ధర నిర్ణయించారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ రీ రిలీజ్ తో పాటు ‘వారణాసి’ గ్లిమ్స్ ను కూడా జత చేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: