హీరో అడివిశేష్, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కాంబినేషన్‌లో వస్తున్న ‘డెకాయిట్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మృణాల్ ఠాకూర్ తన భాగం షూటింగ్ పూర్తి చేయడానికి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 19న ఉగాది కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read also: Tollywood Updates: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా.. టైటిల్ ఖరారు?

డెకాయిట్ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. అడివిశేష్ హీరోగా నటించిన క్షణం, గూఢచారి చిత్రాలకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేసిన షనీల్ డియో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌పై సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: