ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే భారీ చిత్రంపై బన్నీ ఫ్యాన్స్‌తో పాటు సినీ ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Takhur) కీలక పాత్రలో కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు సిస్టర్ రోల్‌లో నటించబోతున్నారట.
Read Also: Manchu Manoj: ‘డేవిడ్ రెడ్డి’లో గెస్ట్ రోల్స్‌పై క్లారిటీ ఇచ్చిన మనోజ్
బన్నీకి సిస్టర్‌గా మృణాల్ ఠాకూర్?
ఈ పాత్ర కథలో చాలా కీలకమైనదిగా, బలమైన ఎమోషనల్ టోన్‌తో సాగుతుందని టాక్. అన్న-చెల్లెల మధ్య బంధం, భావోద్వేగాలను అట్లీ తన మార్క్ స్టైల్‌లో చూపించబోతున్నాడని, ఈ పాత్ర ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుందని అంటున్నారు. అయితే ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. నిజంగా మృణాల్ (Mrunal Takhur) సిస్టర్ రోల్‌లో కనిపిస్తారా? లేక మరో షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో వస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. మరోవైపు, ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ భామలు దీపికా పడుకోణె, జాన్వీ కపూర్ మరో కీలక హీరోయిన్ పాత్రలో కనిపించనుంది.

ఒకే సినిమాలో ఇంతమంది స్టార్ హీరోయిన్లు ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్రేజ్ పెరుగుతోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో, నిర్మిస్తున్న ఈ చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్లో ఒక పవర్ఫుల్ డాన్ కథగా ఉండబోతుందట. అట్లీ ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి చేసి, ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్స్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నాడట. మరి మృణాల్ పాత్ర నిజంగానే సిస్టర్ రోల్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మృణాల్ ఠాకూర్ తొలి తెలుగు సినిమా ఏది?
మృణాల్ ఠాకూర్ తొలి తెలుగు సినిమా ‘సీతా రామం’.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: