ఈసారి సంక్రాంతికి టాలీవుడ్ (Movies 2026) బాక్సాఫీస్ పూర్తిగా హీటెక్కబోతోంది. ప్రభాస్, చిరంజీవి వంటి స్టార్ హీరోలు.. రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్, శ్రీవిష్ణు లాంటి చిన్న మీడియం మార్కెట్ ఉన్న హీరోలు.. విజయ్, శివకార్తికేయన్ వంటి పరభాషా హీరోలు బరిలో దిగుతున్నారు. వీరంతా జనవరి 9 నుంచి 14 మధ్య తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Read also: Meenakshi Chaudhary: పెళ్లి రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటి మీనాక్షి
ప్రీ రిలీజ్ ఈవెంట్
5 భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో, జనవరి 7న ఒకే రోజున నాలుగు పెద్ద ఈవెంట్లు జరగనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం రవితేజ హీరోగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ లాంచ్, నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ విడుదల కార్యక్రమాలు ప్లాన్ చేశారు. ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి కూడా అదే రోజు మరో ప్రమోషనల్ ఈవెంట్ ఉండొచ్చని సమాచారం.
ఇలా ఒకే రోజున నాలుగు భారీ ఈవెంట్లు ప్లాన్ చేయడం.. కేవలం రెండు గంటల వ్యవధిలో రెండు ట్రైలర్ లాంచులు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వీటిల్లో ఏయే సినిమాలు జనాల దృష్టిని ఆకర్షిస్తాయో చూడాలి. ఇకపోతే ‘ది రాజాసాబ్’ సినిమా జనవరి 9న రిలీజ్ అవుతుంటే.. 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’, 13న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాలు వస్తున్నాయి. 14న ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలు విడుదల కాబోతున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: