हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Latest News: Mohanlal – దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుపై మోహన్‌లాల్ ఏమన్నారంటే?

Anusha
Latest News: Mohanlal – దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుపై మోహన్‌లాల్ ఏమన్నారంటే?

భారతీయ సినీ చరిత్రలో అతి పెద్ద గౌరవంగా పరిగణించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (Dadasaheb Phalke Award) ను ఈసారి ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ (Mohanlal) అందుకోవడం గర్వకారణం. నాలుగు దశాబ్దాలకుపైగా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన మోహన్‌లాల్‌కు ఈ గుర్తింపు రావడం సినీ పరిశ్రమ మొత్తానికీ ఆనందకరమైన విషయం. “కంప్లీట్ యాక్టర్” అనే బిరుదును సంపాదించుకున్న ఆయన కేవలం మలయాళ సినీ పరిశ్రమ  (“Malayalam film industry”) కే కాకుండా, భారతీయ చలనచిత్ర రంగం మొత్తానికి తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు.

నాలుగు దశాబ్దాలుగా సినీ రంగానికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ అరుదైన గౌరవం దక్కడంపై మోహన్‌లాల్ స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ (X) (ట్విట్ట‌ర్‌) వేదికగా ఆయన తన ఆనందాన్ని, కృతజ్ఞతలను పంచుకున్నారు.

భావోద్వేగపూరిత నోట్‌ను అభిమానులతో పంచుకున్నారు

ఈ పురస్కారం తన ఒక్కడిదే కాదని, తన సినీ ప్రయాణం (Cinema journey) లో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరిదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఒక భావోద్వేగపూరిత నోట్‌ను అభిమానులతో పంచుకున్నారు.”దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా, గౌర‌వంగా ఉంది. ఈ గౌరవం నాది మాత్రమే కాదు, ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరిది.

నా కుటుంబం, ప్రేక్షకులు, సహనటులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల ప్రేమ, నమ్మకం, ప్రోత్సాహమే నా అతిపెద్ద బలం. అవే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఈ గుర్తింపును పూర్తి కృతజ్ఞతతో, నిండు హృదయంతో స్వీకరిస్తున్నాను” అని మోహన్‌లాల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/mohanlal-pawan-kalyan-congratulates-mohanlal-on-receiving-the-dadasaheb-phalke-award/cinema/551356/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870