మలయాళ సినీ పరిశ్రమ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘వృషభ’ (Vrushaba) త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నంద కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్. వ్యాస్ స్టూడియోస్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా సమర్పిస్తోంది. ఈ మూవీ భారీ నిర్మాణ బృందంతో పాటు పలు ప్రముఖ నిర్మాతల చేత నిర్మితమవుతోంది. ఇందులో శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సి.కె. పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా లాంటి ప్రముఖుల సమాఖ్య నిర్మాణాన్ని అందిస్తున్నారు.
పాన్ ఇండియా ప్రేక్షకుల కోసం
‘వృషభ’ సినిమాకు అత్యాధునిక టెక్నాలజీ (Cutting-edge technology) ఉపయోగించి విజువల్ ఎఫెక్ట్స్, ఎక్స్‌షన్ మరియు సీన్లను మెరుగ్గా ప్రదర్శించే ప్రయత్నం జరిగింది. మోహన్‌లాల్ తన మాస్ అట్రాక్షన్, నటనతో ఈ పాత్రలో మరింత ప్రత్యేకతను చాటుతారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాన్ ఇండియా ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని అనేక భాషల్లో విడుదల చేయనున్నారు, దాంతో దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రేక్షకుల ఆకర్షణను పొందే అవకాశం ఉంది.

ఫస్ట్ లుక్ విడుదల
పాన్ ఇండియాగా రాబోతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు టీజర్ అప్‌డేట్‌ను పంచుకున్నారు మేకర్స్. ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఈ సినిమా కథ పురాణాల నేపథ్యంలో, తండ్రీకొడుకుల మధ్య సాగే భావోద్వేగపూరిత పోరాటంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. నంద కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: