తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన “మిరాయ్” సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగిందా? అనేది చూద్దాం.
కథ సారాంశం: అశోకుడి కాలం నుంచి ‘మిరాయ్’ దాకా
కథ ఆరంభం అశోకుడు మరియు కళింగ యుద్ధం నేపథ్యంలో జరుగుతుంది. యుద్ధాల వల్ల మనుషుల్లో పెరుగుతున్న హింసను చూసి మారిన అశోకుడు, తన పరాక్రమానికి మూలమైన దైవిక శక్తులను తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేస్తాడు. వాటిని రక్షించేందుకు తొమ్మిది మంది యోధులను నియమిస్తాడు. కాలక్రమంలో, శక్తివంతమైన తాంత్రికుడు మహావీర్ (మంచు మనోజ్) ఈ గ్రంథాల కోసం ప్రయత్నించడంతో కథ మలుపు తిరుగుతుంది. అతన్ని అడ్డుకోవడానికి, అంబిక ఆశ్రమంలో విద్యనభ్యసించిన విభ (రితిక నాయక్) అనే యువతి వేద (Teja Sajja)ను కలుస్తుంది. వేద తన తల్లిని గుర్తుపట్టలేని orphan. కథ ఎలా పరిణమించిందో, మిగిలిన విషయాలు తెరపై చూడాల్సిందే.

దర్శక తత్వం: కార్తీక్ ఘట్టమనేని విజువల్ బ్రిలియన్స్
కార్తీక్ ఈ కథను రూపొందించిన తీరు మెప్పిస్తుంది. వారణాసి (Varanasi)నుంచి హిమాలయాలు, జపాన్ నుంచి మొరాకో వరకు సాగే కథనం, ప్రపంచ స్థాయి విజువల్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇతిహాసం, ఆధ్యాత్మికత, ఫ్యాంటసీ ఈ మూడింటినీ కలిపి మిక్స్ చేసిన తీరు కొత్తదనం ఇస్తుంది.బగళాముఖీ దేవిని ఈ కథలో భాగంగా చూపడం, శ్రీరాముడు నేపథ్యంలో లింక్ చేయడం దర్శకుడి అధ్యయనాన్ని, దార్శనికతను చూపిస్తుంది.
కథలో “అమ్మ”, “గురువు”, “దైవం” అనే మూడు శక్తివంతమైన భావోద్వేగ అంశాలను దర్శకుడు ప్రధానంగా నిలిపాడు. ఇవి కథను బలపరుస్తూ, హీరో జర్నీకి లోతును తీసుకువచ్చాయి. కథనంలోని స్పిరిచువల్ షేడ్ ప్రేక్షకుడిని లోతుగా తాకుతుంది.
నటీనటుల ప్రతిభ
- తేజ సజ్జా తన పాత్రలో జస్ట్‌ఫై చేశారు. ఒక రేంజ్‌లో యాక్షన్, ఎమోషన్ చూపించారు.
- మంచు మనోజ్ విలన్‌గా ‘బ్లాక్‌స్వోర్డ్’ పాత్రలో పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌ను చూపించారు.
- రితిక నాయక్ రొమాంటిక్ లీడ్‌గా కాకుండా ఒక కీలక పాత్రలో కనిపించి సింపుల్‌గానూ, అద్భుతంగా నటించారు.
- జగపతిబాబు పాత్ర మళ్లీ ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా ఉంది.
టెక్నికల్ స్ట్రాంగ్ పాయింట్స్
- సినగ్రఫీ: డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ పరంగా ఓ స్థాయిని చేరుకున్నారు.
- బీజీఎమ్: గౌర హరి ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాకి ఆత్మలా నిలిచింది.
- ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ కట్టుదిట్టంగా స్క్రీన్‌ప్లేను కట్ చేసి, కథనానికి వేగాన్ని అందించారు.
- గ్రాఫిక్స్: విజువల్ ఎఫెక్ట్స్ లిమిట్స్‌ను బద్దలు కొట్టినట్టుగా అనిపించాయి, ముఖ్యంగా క్లైమాక్స్ లో.
Read hindi news: hindi.vaartha.com
Read also: