నటి మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) తన వివాహంపై సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాలపై స్వయంగా స్పందించారు. నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty)తో కలిసి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.
Read also: Kalyani Priyadarshan: రణ్‌వీర్ సింగ్ తో జోడి కట్టనున్న కళ్యాణి?

తన పెళ్లి గురించి తాను ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయలేదని మీనాక్షి(Meenakshi Chaudhary) వెల్లడించారు. అయినప్పటికీ తనపై పుకార్లు ఎలా సృష్టించబడుతున్నాయో అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. కథ, పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉందని చెప్పారు. ఇటీవల తన వివాహంపై వస్తున్న వార్తలు తనకు అసహనం కలిగిస్తున్నాయని, వాటిలో వాస్తవం లేదని మీనాక్షి స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని, అవన్నీ ఆధారరహిత ప్రచారాలేనని తేల్చి చెప్పారు.
టాలీవుడ్‌కు చెందిన ఓ యువ హీరోతో మీనాక్షి ప్రేమలో ఉన్నారని, కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే వివాహం చేసుకోనున్నారని ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఆమె ప్రతినిధులు ఈ పుకార్లను ఖండించినా అవి కొనసాగుతూనే వచ్చాయి. ఈ పరిస్థితుల్లో మీనాక్షి స్వయంగా స్పందిస్తూ, తన పెళ్లిపై జరుగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: