తమిళ సినిమా పరిశ్రమలో యువ దర్శకుడు, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడిగా కోమలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్, లవ్ టుడేతో హీరోగా కూడా తన సత్తా చాటారు. డ్రాగన్, డ్యూడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేయడంతో ఆయన బ్యాక్ టు బ్యాక్ హిట్ హీరోగా మారారు. ప్రస్తుతం ప్రదీప్ పేరు వినిపిస్తే చాలు.. సినిమా అంటే కంటెంట్ ఉంటుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది.
Read also: Akhanda 2: ఓటీటీలోకి ‘అఖండ 2’ ఎప్పుడంటే?
ప్రదీప్ సరసన మీనాక్షి చౌదరి?
ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) మరోసారి దర్శకుడిగా కెప్టెన్ కుర్చీలో కూర్చోబోతున్నట్లు కోలీవుడ్ టాక్. ఈసారి ఆయన సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో ఓ భిన్నమైన కథను తెరపైకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నారట. దర్శకత్వంతో పాటు హీరోగానూ తనే నటిస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్‌లో ప్రదీప్ సరసన మీనాక్షి చౌదరి నటించనుందన్న సమాచారం ఆసక్తిని మరింత పెంచుతోంది.

ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ప్రారంభమయ్యాయని, మార్చిలో షూటింగ్ మొదలుపెట్టి ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేయాలన్న ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారని ప్రదీప్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గత సినిమాలకంటే భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోందని కూడా టాక్.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: