ప్రభాస్ (Prabhas) నటిస్తున్న కొత్త సినిమా ‘రాజాసాబ్’ (Raja Saab Movie) పై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌పై దర్శకుడు మారుతి (Maruthi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘త్రీ రోజెస్’ (3 Roses Web Series) సీజన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, ట్రోలింగ్ గురించి తనదైన స్టైల్‌లో స్పందించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Also: SP Balasubramanyam: ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

ట్రోలర్స్ తమ దగ్గర ఉన్న నెగెటివిటీనే పంచుతారు
‘త్రీ రోజెస్’ వెబ్ సిరీస్ సీజన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి (Maruthi) మాట్లాడుతూ, ‘నన్ను అంతగా తిట్టకపోయి ఉంటే నేను ‘రాజాసాబ్’ సినిమా తీసేవాడిని కాదు. ట్రోల్స్ నాకు ఎనర్జీ ఇచ్చాయి’ అని అన్నారు. నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ గెలిచిన సందర్భంగా కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రోలర్స్ తమ దగ్గర ఉన్న నెగెటివిటీనే పంచుతారని, వారిని ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని మారుతి సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: