బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ (Kajol) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సాధారణంగా తన వ్యక్తిత్వం, స్పష్టమైన అభిప్రాయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కాజోల్, ఈసారి “పెళ్లికీ ఒక ఎక్స్‌పైరీ డేట్ (expiry date) ఉండాలి, అలాగే రెన్యువల్ ఆప్షన్ (renewal option) ఉండాలి” అని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా 26 ఏళ్లుగా తన భర్త, నటుడు అజయ్ దేవగన్ (Ajay Devgan) తో సుఖంగా జీవిస్తున్న కాజోల్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: Priyanka Chopra: SSMB 9 నుంచి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ విడుదల
వివరాల్లోకి వెళితే.. ట్వింకిల్ ఖన్నా, కాజోల్ కలిసి నిర్వహిస్తున్న ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ (‘Too Much with Kajol and Twinkle’) అనే సెలబ్రిటీ టాక్ షో తాజా ఎపిసోడ్‌కు నటులు విక్కీ కౌశల్, కృతి సనన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్వింకిల్ ఖన్నా “వివాహానికి గడువు తేదీ, రెన్యువల్ ఆప్షన్ ఉండాలా?” అని ప్రశ్నించారు.
దీనికి విక్కీ, కృతి, ట్వింకిల్ ‘వద్దు’ అని చెబుతూ రెడ్ జోన్‌లో నిలబడగా, కాజోల్ మాత్రం ‘అవును’ అంటూ గ్రీన్ జోన్‌లోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు.వెంటనే ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna) సరదాగా “అది పెళ్లి.. వాషింగ్ మెషీన్ కాదు కదా!” అని చమత్కరించారు. దీనికి కాజోల్ బదులిస్తూ, “నేను నిజంగానే అలా అనుకుంటున్నాను.

సరైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని ఎవరు హామీ ఇస్తారు?
మనం సరైన సమయంలో సరైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని ఎవరు హామీ ఇస్తారు? గడువు ఉంటే ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు. అలాగే, రెన్యువల్ ఆప్షన్ ఉంటే ఆ బంధానికి కొత్త అర్థం వస్తుంది” అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించారు.
అదే షోలో “డబ్బుతో ఆనందాన్ని కొనుగోలు చేయవచ్చా?” అనే మరో ప్రశ్న రాగా… కాజోల్ ‘లేదు’ అని సమాధానమిచ్చారు. “డబ్బు ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు నిజమైన సంతోషాన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా కోల్పోతాం” అని ఆమె (Kajol) పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: