हिन्दी | Epaper

Manchu Manoj: మంచు మ‌నోజ్ ఆస‌క్తిక‌ర పోస్ట్

Sharanya
Manchu Manoj: మంచు మ‌నోజ్ ఆస‌క్తిక‌ర పోస్ట్

తెలుగు చిత్రసీమలో విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన మంచు మనోజ్ (Manchu Manoj) నటించిన తాజా చిత్రం ‘భైరవం’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని పురస్కరించుకుని, హీరో మనోజ్ తన ఎక్స్‌ ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్టు చేశారు. ఈ పోస్ట్‌లో మనోజ్ తన తండ్రి మోహన్‌బాబు ‘పెదరాయుడు’ చిత్రంలో నటించిన లుక్‌ను పక్కన ఉంచి, తన లుక్‌ను అందంగా ఎడిట్‌ చేయించారు. దీనికి “ఆయన కొడుకు వచ్చాడని చెప్పు” అనే క్యాప్షన్ జోడించారు.

గత కొద్ది కాలంగా మోహన్‌బాబు (Mohan Babu)తో మనోజ్‌కు తలెత్తిన వ్యక్తిగత విభేదాలు, కుటుంబ కలహాలు పలు సందర్భాల్లో మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాయి. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మనోజ్ భావోద్వేగానికి లోనై, “తండ్రి పాదాలను తాకాలనుంది” అని చెప్పిన విషయం అభిమానులకు గుర్తుండే ఉంటుంది.

భైరవం సినిమాపై భారీ అంచనాలు

‘భైరవం’ (Bhairavam) సినిమాతో మంచు మనోజ్ దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్నాడు. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ వంటి నటులు కూడా కీలక పాత్రలు పోషించారు. విజయ్ కనకమేడల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీకి ఇప్పటి వరకు ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. మనోజ్ సినిమాలకు దాదాపు తొమ్మిదేళ్లు దూర‌మైన త‌ర్వాత చేసిన మూవీ ఇది. దీంతో ఆయ‌న అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూశారు. ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ మేళవించి రూపొందించబడినట్లు సమాచారం. మనోజ్ అభిమానులు అతడి నటనను మళ్లీ పెద్ద తెరపై చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయ‌న మునుపటి సినిమాల కన్నా పూర్తిగా భిన్నంగా కనిపించబోతున్నాడని ట్రైలర్‌ ద్వారా అర్థమవుతోంది.

Read also: Kannappa: ‘క‌న్న‌ప్ప’ సినిమాపై మంచు విష్ణు కౌంట్‌డౌన్ పోస్ట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక

మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ సంచలనం!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ సంచలనం!

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

విజయ్‌కు మూడోసారి సీబీఐ నోటీసులు

“జగన్ గారు… నా జోలికి రావద్దు.. శివాజీ

“జగన్ గారు… నా జోలికి రావద్దు.. శివాజీ

📢 For Advertisement Booking: 98481 12870