हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Mangli: సింగర్ మంగ్లీని దూషించిన వ్యక్తి అరెస్ట్

Anusha
Latest News: Mangli:  సింగర్ మంగ్లీని దూషించిన వ్యక్తి అరెస్ట్

తనపై అసభ్యకర కామెంట్స్ చేసిన వ్యక్తిపై మంగ్లీ (Mangli) గురువారం (నవంబర్ 27) ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి అదుపులోకి తీసుకున్నారు. ‘మేడిపల్లి స్టార్’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాదారుడు మంగ్లీని, ఆమె సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వీడియో పోస్ట్ చేయడంతో, దీనిపై మంగ్లీ (Mangli) స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also: Tere Ishk Mein Review : Tere Ishk Mein మూవీ రివ్యూ 2025 హిట్ లేదా ఫ్లాప్? బాక్స్ ఆఫీస్ కలెక్షన్, కథ వివరాలు…

కేసు నమోదు

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల విడుదలైన మంగ్లీ పాట “బాయిలోన బల్లి పలికే” సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ ‘మేడిపల్లి స్టార్’ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అయితే ఆ వీడియోలో మంగ్లీని బూతులు తిడుతూ, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్టీ సామాజిక వర్గాన్ని కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ఈ వీడియో వైరల్ కావడంతో మంగ్లీ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై మంగ్లీ నేరుగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, మహిళల గౌరవానికి భంగం కలిగించడం, షెడ్యూల్డ్ తెగలను అవమానించడం,

Man arrested for insulting singer Mangli
Man arrested for insulting singer Mangli

ఈ కేసుపై విచారణ జరుగుతోంది

వంటి ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మంగ్లీ మాట్లాడుతూ, “నా పాటలు ప్రజలను అలరిస్తాయి. కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఎంతో బాధించాయి.

ఒక మహిళగా, గిరిజన బిడ్డగా ఇలాంటి అవమానాలు సహించలేను. చట్టంపై నాకు పూర్తి నమ్మకం ఉంది” అని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోందని, సోషల్ మీడియాలో మహిళలు, గిరిజన వర్గాలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870