తెలుగు సినీ పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబం తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మధురమైన సినిమాలు, అనేక చిరస్మరణీయమైన పాత్రలను అందించింది. నటశేఖర కృష్ణ నుంచి సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) వరకు ఘట్టమనేని కుటుంబం, సినిమా ప్రపంచంలో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది.
Read Also: Decoit: ‘డెకాయిట్’ రిలీజ్ డేట్ లాక్ — శేష్ యాక్షన్ ఫీస్ట్‌కు సిద్ధం!
ఇప్పుడు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం వారసురాలు వెండితెరలో అడుగు పెట్టబోతున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ మనవరాలు, ఆయన కుమార్తె మంజుల ఘట్టమనేని, సినీ నటుడు-దర్శకుడు సంజయ్ స్వరూప్ (Sanjay Swarup) ల కుమార్తె జాన్వి స్వరూప్ ఘట్టమనేని హీరోయిన్‌గా పరిచయం కానున్న వార్త సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

ఇప్పటికే విడుదల చేసిన ఆమె ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పసుపు రంగు టాప్, ఆకుపచ్చ ప్యాంట్‌తో ఉన్న ఫొటోలో జాన్వి లుక్ ఫ్రెష్‌గా, ఆకట్టుకునేలా ఉంది. జాన్వికి నటన కొత్తేమీ కాదు. 2018లో తన తల్లి మంజుల దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ చిత్రంలో జాన్వి ఓ చిన్న పాత్రలో కనిపించారు.
అయితే, ఈసారి పూర్తిస్థాయి హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తాత, మామయ్యల బాటలో నటిగా రాణించాలని వస్తున్న జాన్వి తొలి సినిమా వివరాలు, దర్శకుడు, హీరో వంటి ఇతర విశేషాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: