సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మల్టీ-వర్స్ లెవల్ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ గురించి మొదటి రోజు నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా పెద్ద సంచలనంగానే మారుతోంది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ఖరారు చేసింది.
Read Also: Mahesh Babu: రచ్చ చేస్తున్న మహేశ్ బాబు ఫ్యాన్స్..
ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్‌ను 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం అట్టహాసంగా నిర్వహించిన ‘గ్లోబ్‌ట్రాటర్’ (Globetrotter) ఈవెంట్‌లో ఈ కీలక ప్రకటన చేశారు.మహేశ్ బాబు త్రిశూలాన్ని చేతపట్టుకుని ఎద్దు (నంది)పై స్వారీ చేస్తున్న విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

నయా స్టైలిష్ లుక్‌లో చిరునవ్వులు చిందిస్తూ
కాగా ఈవెంట్‌లో గ్రే కలర్ సూట్‌లో స్టైలిష్ హెయిర్, గడ్డంతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు మహేశ్ బాబు. ఎప్పటిలా కాకుండా ఈ సారి నయా స్టైలిష్ లుక్‌లో చిరునవ్వులు చిందిస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు మహేశ్ బాబు. ఇక ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) సంప్రదాయం ఉట్టిపడేలా లంగావోణిలో కనిపించింది.
సూపర్ కూల్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తున్న తమ అభిమాన హీరోను, చిరునవ్వులు చూసి ఎగిరిగంతేస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్. దీనికి సంబంధించిన విజువల్స్ కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈవెంట్‌లో శృతిహాసన్ డ్యాన్స్‌తో స్టేజ్‌ను షేక్ చేసింది. ఈవెంట్‌లో పృథ్విరాజ్ సుకుమారన్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: