సాధారణంగా యానిమేషన్ సినిమాలను ఎక్కువగా చిన్నపిల్లలకోసం మాత్రమే రూపొందిస్తారని ప్రజలలో ఒక అభిప్రాయం ఉంది. పెద్ద వయసున్న ప్రేక్షకులు, యువతలు ఈ సినిమాలకు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు అనేది ఎక్కువగా కనిపించే దృశ్యం. అయితే, ఇటీవల విడుదలైన ‘మహావతార్ నరసింహ’ సినిమా (Mahavatar Narasimha Movie) ఈ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చే విధంగా నిలిచింది.
హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) సమర్పణలో వచ్చిన ఈ సినిమా, జులై 25వ తేదీన థియేటర్లలోకి వచ్చింది.. ప్రారంభంలో పెద్ద ప్రాచారం లేకపోయినా, సినిమా తన ప్రత్యేకత ,కధా నిర్మాణం వల్ల ప్రేక్షకుల మధ్య ప్రత్యేక గుర్తింపును పొందింది. సినిమా విడుదలకు ముందే భారీ ప్రచారం లేకపోవడం, అప్పట్లో కొంతమంది ప్రేక్షకులను గందరగోళానికి గురిచేసింది. కానీ సినిమా విడుదల తర్వాత, మంచి రివ్యూస్, ప్రేక్షకులకు నచ్చడంతో,ఇది Box Office వద్ద సత్తా చాటింది.మరి ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూ లో తెలుసుకుందాం.
కథ
40 కోట్లతో నిర్మితమై 300 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. కశ్యప మహర్షి .. ‘దితి’ దంపతులు అసురసంధ్య వేళలో కలుసుకోవడం వలన, హిరణ్యాక్షుడు – హిరణ్య కశిపులు అసురులుగా జన్మిస్తారు. ఇద్దరు అన్నదమ్ములు కూడా లోక కంటకులుగా మారతారు. వారి కారణంగా సాధుజనుల మొదలు దేవతలవరకూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే హిరణ్యాక్షుడు భూమిని పాతాళ లోకానికి తీసుకుని వెళతాడు.
దాంతో భూదేవిని రక్షించడం కోసం శ్రీమన్నారాయణుడు వరాహావతారాన్ని ధరిస్తాడు. పాతాళలోకం నుంచి భూమిని పైకి తీసుకువస్తూ అందుకు అడ్డుపడిన హిరాణ్యాక్షుడిని సంహరిస్తాడు.సోదరుడి మరణం హిరణ్య కశిపుడిని కలిచివేస్తుంది. తన సోదరుడి మరణానికి కారకుడైన విష్ణుమూర్తిని సంహరించాలని నిర్ణయించుకుంటాడు. బ్రహ్మ దేవుడి గురించి హిరణ్య కశిపుడు కఠోర తపస్సు చేస్తాడు. తనకి మానవుల వలనగానీ .. మృగాల వలనగానీ .. పగలు – రాత్రి, ఇంటా బయటా ..నింగి – నేలపై ..
కథనం
ఎలాంటి ఆయుధాల వలన మరణం సంభవించకుండా ఉండేలా వరాన్ని ప్రసాదించమని కోరతాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరిస్తాడు.హిరణ్య కశిపుడు తన రాజ్యంలో ఎక్కడా హరి నామస్మరణ జరగకుండా శాసనాలు చేస్తాడు. అయితే అతని ద్వారా లీలావతికి జన్మించిన ప్రహ్లాదుడు, హరి నామస్మరణ చేయకుండా ఉండలేని స్థితికి చేరుకుంటాడు. తాను తల్లి గర్భంలో ఉండగా, నారద మహర్షి చేసిన హరి కథామృతమే అందుకు కారణం. ఎంతగా హెచ్చరించినా ప్రహ్లాదుడు హరి నామస్మరణ మానకపోవడంతో, అతనిని అంతం చేయాలని హిరణ్యకశిపుడు (Hiranyakashipu) తన అనుచరులను ఆదేశించడంతో ఈ కథ పాకాన పడుతుంది.

శ్రీమహా విష్ణువు (Lord Vishnu) ధరించిన దశావతారాలలో ప్రతి అవతారం వెనుక లోక కల్యాణమే పరమార్థంగా కనిపిస్తుంది.అలాగే ప్రతి అవతారం ధరించడానికి ముందు స్వామి ఇంద్రాది దేవతలతో కలిసి ఒక వ్యూహ రచన చేయడం కనిపిస్తుంది. కానీ అలాంటి ఒక వ్యూహ రచన చేయకుండా, తన భక్తుడిని రక్షించడం కోసం అప్పటికప్పుడు స్వామివారు ధరించిన అవతారమే నృసింహ అవతారం.
ఒక భక్తుడి కోసం ఒక అవతారాన్నే ధరించవలసి రావడం అనేది ఇక్కడ ప్రత్యేకం.నిజానికి ఇది చాలా విసృతమైన పరిధిని కలిగిన కథాంశం. కానీ దానిని ఒక సినిమాకి తగిన విధంగా మలిచి, యానిమేషన్ (Animation) ద్వారా బహుళ భాషలలో అందుబాటులోకి తీసుకుని రావడానికి చేసిన ప్రయత్నం అభినందనీయమేనని చెప్పాలి. పురాణ సంబంధమైన అంశాలకు ప్రాధాన్యతను ఇస్తూనే, ఈ తరం ప్రేక్షకులకు అర్ధమయ్యే సరళమైన మార్గాన్ని అనుసరించవలసి ఉంటుంది.
విశ్లేషణ
అలాగే పురాణ సంబంధమైన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకుని వెళ్లవలసి ఉంటుంది. ఈ విషయంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి.అటు దేవలోకం .. ఇటు అసురుల రాజ్యం .. ప్రహ్లదుడి బాల్యం .. ఒకదాని తరువాత ఒకటిగా అతనికి శిక్షలను అమలుపరిచే విధానం తాలూకు దృశ్యాలను అద్భుతంగా ఆవిష్కరించారు. హిరణ్యకశిపుడి అంతఃపురం .. ఆయన సభా భవనాన్ని డిజైన్ చేసిన విధానం గొప్పగా అనిపిస్తుంది. హిరాణ్యాక్షుడు .. వరాహస్వామి పోరాటానికి సంబంధించిన సన్నివేశం,
అలాగే హిరణ్య కశిపుడు – నృసింహ స్వామికి సంబంధించిన పోరాట దృశ్యాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయని చెప్పాలి. చివరి 24 నిమిషాలు మరింత కీలకంగా నిలుస్తాయి. ఈ సినిమా యానిమేషన్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ మెచ్చుకోకుండా ఉండలేం. అందరూ కూడా పురాణ సంబంధమైన అంశాలపై పూర్తి అవగాహనతో పని చేయడం కనిపిస్తుంది. ఒక పురాణ సంబంధమైన విషయానికి యానిమేషన్ లో ఎలాంటి ఒక దృశ్య రూపాన్ని ఇవ్వాలనే విషయంపై జరిగిన కసరత్తుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తప్పకుండా ఈ దృశ్యాలు పిల్లలను మరో లోకంలోకి తీసుకుని వెళతాయి .. వారి మనసులను మరింత బలంగా హత్తుకు పోతాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: