Mahavatar Narsimha collection : హోంబలే ఫిలింస్ నిర్మించిన మహావతార్ నరసింహ (Mahavatar Narsimha collection) విడుదలై ఆరు వారాలు గడిచినా, బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి, భారతదేశపు అతిపెద్ద యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది. అద్భుతమైన యానిమేషన్, సంగీతం, కథన శైలి కారణంగా ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన అందుకుంటోంది.
జూలై 25న భారతదేశంలో విడుదలైన ఈ చిత్రం
జూలై 25న భారతదేశంలో విడుదలైన ఈ చిత్రం, జూలై 31 నుంచి శ్రీలంక, ఆస్ట్రేలియా, మలేషియా, యూరప్ వంటి అనేక దేశాల్లో రిలీజ్ అయింది. కూలీ, వార్ 2 వంటి స్టార్ హీరోల సినిమాల మధ్యలో కూడా ఈ చిత్రం మంచి ఆక్యుపెన్సీని సాధించి, దేశీయంగా మరియు విదేశాల్లోనూ హౌస్‌ఫుల్ షోలను కొనసాగిస్తోంది.
హిందూ పురాణ కథ
హిందూ పురాణ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో, భక్త ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశిపు మధ్య జరిగిన సంఘటనలను చూపించారు. తన కుమారుడి భక్తిని అణచివేయడానికి ప్రయత్నించిన హిరణ్యకశిపుని, విష్ణువు నరసింహ అవతారంలో ప్రత్యక్షమై సంహరించిన ఘట్టం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఈ చిత్రాన్ని శిల్ప ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా నిర్మించగా, సంగీతాన్ని సమ్ సి.ఎస్ అందించారు. జయపూర్ణ దాస్, రుద్ర ప్రతాప్ ఘోష్ కథా, స్క్రీన్‌ప్లే రాశారు.
హోంబలే ఫిలింస్ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఇది మొదటి చిత్రం. 2025 నుంచి 2037 వరకు విష్ణువు దశావతారాల ఆధారంగా పలు సినిమాలు విడుదల చేయబోతున్నారు. అందులో మహావతార్ పరశురామ 2027లో రానుంది.
Read also :