ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా భారీగా డిమాండ్ ఉన్న స్టార్. వరుసగా సినిమాలను లైనప్ చేసుకుంటూ ఎప్పుడూ కెమెరా ముందు బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఆయన ది రాజా సాబ్ (The Raja Saab Movie) షూటింగ్‌లో పాల్గొంటూ, మరోవైపు ఫౌజీ ప్రాజెక్ట్‌లో షూటింగ్‌లో ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు ముగిసిన వెంటనే ప్రభాస్ తన తదుపరి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్పిరిట్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడని సమాచారం.
Sivakarthikeyan: ‘మదరాసి’ ఓటీటీ విడుదల
‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి
ఈ చిత్రంలో హీరోయిన్‌గా ముందు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణేని తీసుకోగా కొన్ని వివాదాల కారణంగా ఆమెను తప్పించిన ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ని తీసుకున్నారు. హై యాక్షన్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది.
ఇందులో ప్రభాస్‌కి తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారన్న వార్త మరింత హైప్ ఇస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) విదేశాల్లో షూటింగ్ లొకేషన్లు కూడా ఫిక్స్ చేశాడని తెలుస్తోంది.
నవంబర్ 5 నుంచి షూటింగ్ అధికారికంగా ప్రారంభమవుతోంది
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం నవంబర్ 5 నుంచి షూటింగ్ అధికారికంగా ప్రారంభమవుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషన్ థ్రిల్లర్ (High voltage action and emotion thriller) గా తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించి వచ్చే ప్రతి అప్‌డేట్ ప్రభాస్ ఫ్యాన్స్‌కి కిక్కిస్తోంది.

త్రిప్తి దిమ్రి, చిరంజీవి, సంజయ్ దత్‌తో అదిరిపోయే క్యాస్టింగ్ సెట్ చేసిన సందీప్ వంగా కీలక పాత్రలో మరో బ్యూటీని తీసుకోనున్నాడట. ఆమె ఇంకెవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ మడోన్నా సెబాస్టియన్ (Madonna Sebastian) . నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’లో లాయర్‌గా అదరగొట్టిన బ్యూటీయే ఈ మడోన్నా.
కరీనా కపూర్‌ని అనుకోగా చివరికి మడోన్నాని
లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ‘లియో’లో విజయ్ చెల్లెలిగానూ నటించింది. ఈ పాత్ర కోసం ముందుగా కరీనా కపూర్ (Kareena Kapoor) ని అనుకోగా చివరికి మడోన్నాని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె ఇందులో సెకండ్ హీరోయినా.. లేక విలన్ రోలా అన్నది తెలియాల్సి ఉంది.
మలయాళంలో ‘ప్రేమమ్’ చిత్రంతో ఫేమ్ సంపాదించించుకున మడోన్నా సెబాస్టియన్, తెలుగులో ‘ప్రేమమ్’ రీమేక్‌లోనూ నాగచైతన్య సరసన నటించింది. అందం, అభినయం ఉన్నా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రంలో ఛాన్స్ రావడంతో మడోన్నా దశ తిరిగినట్లేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: