Madharasi Movie : హీరో శివకార్తికేయన్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన మదరాసి సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన (Madharasi Movie) మాట్లాడుతూ, తెలుగు సినిమాలు ఎందుకు ₹1000 కోట్ల వసూళ్లు సాధిస్తాయో వివరించారు. మంచి కంటెంట్ ఉంటే నిర్మాతలు డబ్బు విషయంలో ఎప్పుడూ రాజీ పడరని అన్నారు.
అనిరుధ్ ఇచ్చిన సంగీతం ఈ సినిమాకు హైలైట్ అవుతుందని చెప్పారు. రుక్మిణీ చాలా టాలెంటెడ్ అని, ఆమెతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకున్నాడు. యాక్షన్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు.
రజనీకాంత్ తనకు ప్రేరణ అని, కాలేజీ రోజుల నుంచే మిమిక్రీ చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. తన స్నేహితులు, భార్య ఆర్తి ఎప్పుడూ తనను నమ్మి, ప్రోత్సహించారని తెలిపారు. యాక్టర్ కాకపోయి ఉంటే పోలీస్ అయ్యేవాడినని చెప్పారు.

Read also :