हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Mad Square OTT: ఓటీటీలోకి వచ్చేసిన మ్యాడ్ స్క్వేర్.. ఎక్కడ చూడొచ్చంటే?

Ramya
Mad Square OTT: ఓటీటీలోకి వచ్చేసిన మ్యాడ్ స్క్వేర్.. ఎక్కడ చూడొచ్చంటే?

థియేటర్లను షేక్ చేసిన మ్యాడ్ స్క్వేర్ – ఇప్పుడు ఓటీటీలో సందడి

ప్రేక్షకులను పగలబడి నవ్వించిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా ఇప్పుడు నేరుగా మీ ఇంట్లోకి వచ్చేసింది. థియేటర్లలో సూపర్ హిట్ టాక్‌తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ఫన్ ఎంటర్‌టైనర్, ఏప్రిల్ 25 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్. ఉగాది పండుగ కానుకగా మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే హిట్ టాక్‌ను అందుకుంది. ఓవైపు కామెడీ, మరోవైపు ఫ్రెండ్‌షిప్ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను హాయిగా నవ్విస్తూ ఎమోషనల్‌గా కూడా మెప్పించింది.

బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసిన మాస్ ఎంటర్‌టైనర్

2023లో పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన “మ్యాడ్” సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ విజయం తర్వాత రూపొందించిన సీక్వెల్ “మ్యాడ్ స్క్వేర్” మరోసారి ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేసింది. ఈ సారి సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ట్రాయో మళ్లీ తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ సీక్వెల్‌లో రెబా మోనికా జాన్, ప్రియాంక జువాల్కర్ వంటి గ్లామరస్ హీరోయిన్లను కూడా కలిపి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మొదటి భాగం కన్నా ఎక్కువ నవ్వులు పంచుతూ, బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ట్రేడ్ అనలిస్టులను ఆశ్చర్యపరిచింది.

మ్యూజిక్, నిర్మాణ విలువలు మ‌రింత ఆకర్షణగా

ఈసారి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్‌కు తోడుగా తమన్ బీజీఎమ్ అందించి, సినిమాకు మ‌రింత ఎనర్జీని జత చేశారు. విజువల్స్, డైలాగ్స్, ఎడిటింగ్ అన్నీ అత్యుత్తమంగా ఉండటంతో, సినిమా థియేటర్లలో ఓ విజయోత్సవ వాతావరణాన్ని కలిగించింది. ప్రేక్షకులంతా హాల్‌లో నవ్వుల పూసలు పూయించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర హారిక, సాయి సౌజన్య కలిసి నిర్మించిన ఈ సినిమా టెక్నికల్‌గా కూడా ఒక క్లాస్ ప్రొడక్షన్ అనిపించింది.

ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో – అన్ని భాషల్లో అందుబాటులో

థియేటర్లలో ఈ హంగామా మిస్ అయినవారికోసం, లేదా మళ్లీ చూడాలనుకునే వారి కోసం, మ్యాడ్ స్క్వేర్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించినట్టుగా, ఏప్రిల్ 25 నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. మంచి క్వాలిటీ వీడియో, సబ్‌టైటిల్స్‌తో ఈ సినిమా ఎక్కడున్నా – మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్ – ఎక్కడైనా చూసేయొచ్చు.

మీ ఇంట్లోనే థియేటర్ ఎఫెక్ట్

ఇంట్లో కుటుంబం అంతా కలిసి చూడగలిగే ఓ పక్కనవ్వే వినోదాత్మక సినిమా కావాలంటే, మ్యాడ్ స్క్వేర్ బెస్ట్ ఆప్షన్. పక్కా ఫ్రెండ్‌షిప్ ఎమోషన్స్, కాలేజీ జోష్, ఫన్నీ మొమెంట్స్‌తో సినిమాను ఒక్కసారి చూస్తే మళ్లీ చూడాలనిపిస్తుంది. థియేటర్లలో మిస్ అయినా వర్కౌట్ అయ్యేలా ఇంట్లోనే రిపీట్ వాచ్ మూడ్‌లోకి తెస్తుంది.

READ ALSO: Movie review: ‘వీర ధీర సూరన్ 2’ సినిమా రివ్యూ!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870