ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన లిటిల్ హార్ట్స్ (Little Hearts) థియేటర్లలో ఘన విజయం సాధించింది. చిన్న సినిమా అయినప్పటికీ ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకుంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.ఈ చిత్రంలో యూట్యూబర్ మౌళి తనూజ్ హీరోగా నటించగా, శివాని నాగారం హీరోయిన్‌గా మెప్పించింది. సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో రాజీవ్ కనకాల, ఎస్.ఎస్. కాంచి, సత్య కృష్ణన్, జయకృష్ణ వంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రల్లో కనిపించారు.
Bigg Boss Season 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనే?

సక్సెస్ వెనుక ఉన్న జట్టు
90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్న దర్శకుడు ఆదిత్య హసన్ ఈ సారి నిర్మాతగా మారి లిటిల్ హార్ట్స్ ను నిర్మించాడు. తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది.సెప్టెంబర్ 5న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాపై ఫిదా అయిపోయారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా థియేటర్లకు వెళ్ళి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు.
చిన్న సినిమా.. భారీ కలెక్షన్లు
కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 50 కోట్ల వరకు వసూళ్లు సాధించిందని సమాచారం. ఇలా చిన్న సినిమా బ్లాక్ బస్టర్ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.లిటిల్ హార్ట్స్ చూసిన మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అడివి శేష్ వంటి స్టార్ హీరోలు ఈ చిత్రానికి ప్రశంసలు కురిపించారు. వారి మాటలతో సినిమా మరింత హైప్ సొంతం చేసుకుంది.థియేటర్లలో విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి వస్తోంది. ఈటీవీ విన్ దసరా కానుకగా లిటిల్ హార్ట్స్ ను అక్టోబర్ 1న స్ట్రీమింగ్ (Streaming on October 1st) చేయనుంది.
అదనపు సర్ప్రైజ్ కూడా
ఓటీటీ వెర్షన్‌లో కొన్ని అదనపు సన్నివేశాలు కూడా చేర్చనున్నట్టు సంస్థ ప్రకటించింది. దీంతో ఇప్పటికే సినిమాను చూసిన ప్రేక్షకులు కూడా ఓటీటీలో మళ్లీ చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.కంటెంట్ బలంగా ఉంటే బడ్జెట్ పెద్దది కాదని మరోసారి రుజువు చేసిన సినిమా లిటిల్ హార్ట్స్. ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా సక్సెస్ స్టోరీ రిపీట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.
Read Also :