మెగా హీరో వరుణ్ తేజ్ సతీమణి.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి సోమవారం (డిసెంబర్ 15) తన పుట్టిన రోజు సెలబ్రేట్(Lavanya Tripathi) చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగా, అల్లు కుటుంబీకులతో పాటు పలువరు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు లావణ్యకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక వరుణ్ తేజ్(Varun Tej) తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు. లావణ్యతో వివిధ సందర్భాల్లో దిగిన బ్యూటిఫుల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వరుణ్ తేజ్ ‘హ్యాపీ బర్త్ డే బేబీ’.. అంటూ భార్యపైతన ప్రేమను చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Read also: హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

కుమారుడి ప్రైవసీపై వరుణ్–లావణ్య జాగ్రత్త
వీటిని చూసిన రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కూడా లావణ్యకు బర్త్‌డే విషెస్ తెలిపింది. సమంత కూడా ప్రత్యేక విషెస్(Lavanya Tripathi) తెలిపింది. అలాగే మెగా అభిమానులు సైతం మెగా కోడలికి శుభాకాంక్షలతో కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఫొటోల్లో వరుణ్, లావణ్యల ముద్దుల కుమారుడు కనిపిస్తాడేమోనని అభిమానులు ఆసక్తిగా గమనించారు. కానీ తమ కుమారుడి ముఖం కనిపించకుండా ఇద్దరూ జాగ్రత్త పడ్డారు. పిల్లల ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తూ తీసుకున్న ఈ నిర్ణయానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: