దుబాయ్ వేదికగా 2025 సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) వేడుకలు రెండు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ ప్రముఖ అవార్డులు ప్రతి సంవత్సరంనా దక్షిణ భారతీయ సినిమాకి గుర్తింపు ఇవ్వడానికి, ప్రతిభను స్ఫూర్తిదాయకంగా పురస్కరించడానికి నిర్వహించబడతాయి. ఈ సంవత్సరం కూడా వేడుకలు, స్టార్ తారలు, నిర్మాతలు, దర్శకులు, అభిమానులు అందరినీ ఒకే చోట చేర్చాయి.2024 సంవత్సరంలో విశేష ప్రతిభ చూపించిన తెలుగు, కన్నడ నటీనటులు, సినిమాలకు అవార్డులను ప్రకటించారు. 13వ సైమా అవార్డ్స్ వేడుకలలో పుష్ప 2, కల్కి సినిమాలు సత్తా చాటాయి.
కల్కి సినిమాలు ఎక్కువ అవార్డ్స్
మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్రాల్లో అత్యంత ఎక్కువ ప్రతిభ కనబర్చిన నటీనటులు అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. అలాగే చిత్రాలకు, చిత్రబృందాలకు సైతం అవార్డులను అందించారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా అడియన్స్ ముందుకు వచ్చి మరో లోకంలోకి తీసుకెళ్లిన కల్కి 2898 ఏడీ సినిమా (Kalki 2898 AD movie) ఉత్తమ చిత్రంగా సైమా అవార్డ్ గెలుచుకుంది. అలాగే ఈ వేడుకలలో పుష్ప 2 మూవీ సత్తా చాటింది.13వ సైమా వేడుకలలో తెలుగులో పుష్ప 2, కల్కి సినిమాలు ఎక్కువ అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక అవార్డ్స్ అందుకున్నారు. ఇక ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ నిలిచారు.

సైమా అవార్డ్స్ విజేతలు వీళ్లే
- ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
- ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప2)
- ఉత్తమ నటి: రష్మిక (పుష్ప2)
- ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప2)
- ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్ (కల్కి 2898 ఏడీ)
- ఉత్తమ హాస్య నటుడు: సత్య (మత్తు వదలరా 2)

- ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే)
- ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప2)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: రత్నవేలు (దేవర)
- ఉత్తమ విలన్: కమల్ హాసన్ (కల్కి 2898 ఏడీ)
- ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
- ఉత్తమ నేపథ్య గాయని: శిల్పారావ్ (చుట్టమల్లే)
- ఉత్తమ పరిచయ నటి: భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)

- ఉత్తమ నూతన నిర్మాత : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జా (హనుమాన్)
- ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
- ఉత్తమ నటుడు (కన్నడ): కిచ్చా సుదీప్
- ఉత్తమ నటి (కన్నడ) : ఆషిక రంగనాథ్
- ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ (హనుమాన్)
- ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా : అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్)
- ఉత్తమ దర్శకుడు (కన్నడ): ఉపేంద్ర (యూఐ)
- ఉత్తమ చిత్రం (కన్నడ): కృష్ణం ప్రణయ సఖి
Read hindi news : hindi.vaartha.com
Read also: