భారీ సినిమాలు వరుసగా నిరాశ పరుస్తున్న ఈ సమయంలో, చిన్న సినిమా ఒకటి బాక్సాఫీస్ వద్ద విశేష విజయాన్ని అందుకోవడం విశేషం. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ అనే చిత్రం ప్రస్తుతం తెలుగు సినీ వర్గాల్లో, ముఖ్యంగా ప్రేక్షకుల మధ్య మంచి హంగామా క్రియేట్ చేస్తోంది.
విడుదలైన మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్ (Positive talk) తెచ్చుకున్న ఈ మూవీ, వసూళ్ల పరంగా కూడా పెద్ద సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తోంది.అమెరికాలో అయితే ఈ సినిమా మరింత సత్తా చాటుతోంది. పెద్ద సినిమాలకే షాక్ ఇస్తూ, ఓ చిన్న సినిమా ఇంతటి కలెక్షన్లు సాధించడం నిజంగా ఆశ్చర్యమే. ఫ్యామిలీ ఆడియెన్స్, యువత రెండింటినీ బాగా ఆకట్టుకుంటూ ‘లిటిల్ హార్ట్స్’ వినూత్నమైన కంటెంట్‌తో అందరినీ అలరిస్తోంది.
లిటిల్ హార్ట్స్ చిత్రం
ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో యూట్యూబర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న మౌళి తనూజ్ ప్రశాంత్ ,అందాల భామ శివానీ నాగరం (Shivani Nagar) నటించారు. వీరి జంట తెరపై ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తోంది. డైరెక్టర్ సాయి మార్తాండ్ ఈ కథను హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇంతవరకు ఎక్కువ మంది దర్శకులు టచ్ చేయని కొత్త కాన్సెప్ట్‌ని ఎంచుకుని, వినోదాన్ని పక్కాగా అందించడం ద్వారా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.
ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ తీసుకుంది.సినిమా విజయం సాధించడంతో పాటు, ఇందులో నటించిన మౌళి తనూజ్ ప్రశాంత్ మీద కూడా ప్రత్యేక దృష్టి పడుతోంది. యూట్యూబ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ యువ నటుడు, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన ప్రతిభను చాటుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆయన నటన, కామెడీ టైమింగ్, సహజసిద్ధమైన నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

నాని ట్వీట్ పై స్పందించిన మౌళి
తాజాగా హీరో నాని.. ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. చాలా రోజుల తర్వాత కడుపుబ్బా నవ్వుకున్నాని.. సినిమా చాలా ఫన్నీగా ఉందంటూ నటీనటుల్ని ప్రశంసిస్తూ నాని పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే ఈ ట్వీట్‌కి రిప్లయ్ ఇస్తూ హీరో మౌళి పెట్టిన పోస్ట్ ఎమోషనల్‌గా ఉంది.
చాలా థాంక్స్ నాని అన్న.. నీకు తెలియకపోవచ్చు అన్నా కానీ నేను పిల్ల జమిందార్ నుంచి నీకు పెద్ద ఫ్యాన్‌ని. నిన్ను ఇంతకుముందు కలిసే అవకాశం కూడా నాకు వచ్చింది. కానీ ర్యాండమ్ ఫ్యాన్‌గా కాకుండా నా వర్క్ నీకు తెలిశాక కలుద్దామని ఫిక్స్ అయ్యా. దాని కోసమే పని చేశాను.. ఈరోజు కొట్టాను అన్నా.. మౌళి.. నానికి డై హార్డ్ ఫ్యాన్ ఫరెవర్. ఈరోజు కొత్త ఛాలెంజ్ పెట్టుకుంటా.. ఏదో ఒకరోజు ‘నీ గోడలో ఇటుకనవుతా పక్కా'” అంటూ మౌళి పోస్ట్ పెట్టాడు.
గోడ కనబడుతుంది
నాని ఫ్యాన్స్‌కి ఈ డైలాగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. “ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపిస్తుందేమో.. కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు.. ఒక గోడ కనబడుతుంది.. సాలిడ్ గోడ.. బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు” అంటూ తన సినిమా ఈవెంట్‌లో నాని చెప్పిన ఈ డైలాగ్ అప్పట్లో తెగ వైరల్ అయింది.
Read hindi news:hindi.vaartha.com
Read Also: